అప్పుడు మహేష్ బాబు ఇప్పుడు నాని.. ప్రమోషన్స్ పెంచిన ‘నాంది’
ఓ సినిమాకు అన్నింటికంటే ముఖ్యంగా ప్రమోషన్స్ చాలా అవసరం. ఓ చిన్న సినిమాను, కొత్త రకం కథలతో వస్తోన్న సినిమాలను జనాలకు మరింత దగ్గరగా చేయాలంటే పెద్ద పేరున్న సెలెబ్రిటీలతో ప్రమోషన్స్ చేయించాలి. అప్పుడు జనాల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తుంటారు. అలా అల్లరి నరేష్ తన పరిధి దాటి ఓ ప్రయోగాన్ని చేస్తున్నాడు.అదే నాంది సినిమా. ఈ మూవీ ట్రైలర్‌ను మహేష్ బాబు చేతుల మీదగా రిలీజ్ చేయించారు.
అలా మహేష్ బాబు నాంది సినిమా ట్రైలర్ చేయడంతో ఎక్కువ మందికి రీచ్ అయింది. మూవీ ట్రైలర్ కూడా బాగా ఉండటంతో యూట్యూబ్‌లో దూసుకుపోతూ ఉంటుంది. అలా ఇప్పుడు మరోసారి నాంది ట్రెండింగ్‌లోకి వచ్చేందుకు రెడీ అయింది. అయితే ఈ సారి పాటతో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు వస్తోంది. ట్రైలర్‌కు మహేష్ బాబును వాడిన యూనిట్.. మొదటి పాటకు నానిని వాడేస్తున్నారు.

న్యాచురల్ స్టార్ నాని చేతుల మీద నాంది మొదటి పాట 'చెలి'ని రేపు బయటకు వదలబోతోన్నారు. ఫిబ్రవరి 9న ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు పాటను విడుదల చేయబోతోన్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ లెవెల్స్‌ను పెంచేస్తున్నారు. బంగారు బుల్లోడు సినిమాతో అల్లరి నరేష్ ఫ్లాపు కొట్టినా నాంది సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటాడని అంతా భావిస్తున్నారు. ఫిబ్రవరి 19న ఈ మూవీ భవితవ్యం ఏంటో తెలియనుంది.


Click it and Unblock the Notifications











