నాని, అనిరుధ్ రచ్చకు ‘సీను సిరిగి.. సీటులిరిగి.. సీటీ కొట్టాలోయి..’

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం 'నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌'. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ప్రీ లుక్‌కి, ఫస్ట్‌లుక్‌కి, ఫస్ట్‌ సాంగ్‌కి, టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఒక ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

సీను సిరిగి.. సీటులిరిగి.. సీటీ కొట్టాలోయి.. అంటూ సాగే సినిమా ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌ను గురువారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సాంగ్‌లో నేచుర‌ల్ స్టార్ నాని, మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ సంద‌డి చేశారు. సినిమాలో ల‌క్ష్మి, శ‌రణ్య‌, హీరోయిన్ ప్రియాంక‌తో పాటు సినిమాలో న‌టించిన చిన్న పాప క్యారెక్ట‌ర్స్ గురించి నాని ఎక్స్‌ప్లెయిన్ చేసేలా ఈ ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌ను అనిరుధ్ డిజైన్ చేశారు.

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Nanis Gang Leader song goes viral

ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, రచనా సహకారం: ముకుంద్‌ పాండే, పొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, వి.ఎఫ్.ఎక్స్.: మకుట, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X