నాని ఎమోషన్స్.. కాలభైరవ హైఓల్టేజ్ ఎనర్జీ.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా స్పిరిట్ ఆఫ్ జెర్సీ
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నేచురల్ స్టార్ నాని హీరోగా మళ్లీ రావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా రూపొందించిన చిత్రం జెర్సీ. విడుదలకు ముందే ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అంచనాలకు తగినట్టే ఫస్ట్‌లుక్, టీజర్లు, సింగిల్స్ ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండో సింగిల్‌ను స్పిరిట్ ఆఫ్ జెర్సీ పేరుతో విడుదల చేశారు. పాటలో ఎలా ఉందంటే..

ఎమోషన్స్ సాగిన ‘అణిగి మణిగిన’ పాట
అణిగి మణిగిన అలలు ఇక ఎగిసెను చూడరా అనే పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, కాలభైరవ ఈ పాటను ఆలపించారు. పాటకు సాహిత్యాన్ని కృష్ణకాంత్ (కేకే) అందించారు. సంగీత ప్రియులను ఆకట్టుకొనే విధంగా ఉద్వేగ భరితంగా ఆ పాట సాగడం ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు.

ఆకట్టుకొనే పద ప్రయోగం
అసలు అవధులు లేవురా.. అలుపు దరి చేరనీకురా.. ఆడరా.. మలుపు మలుపు చెరగని గుర్తులు వీడరా అంటూ చాలా ఎమోషనల్‌గా పాట సాగడం.. పాటకు తగినట్టు నానితో కూడిన విజువల్స్ ఆకర్షణీయంగా మారాయి. పరుగుల దాహం, పగలు మెరుపులు లాంటి పద ప్రయోగం బాగుంటమే కాకుండా యువతలో స్ఫూర్తిని నింపింది.

పాటలో కాలభైరవ హై ఓల్టేజ్ ఎనర్జీ
అణిగి మణిగిన అలలు పాటలో ఉండే భావోద్వేగానికి కాల భైరవ గొంతు జతకలవడం మరింత ఎట్రాక్షన్‌గా మారింది. యూత్‌ను ఆకట్టుకొనే విధంగా పాట క్రేజీగా ఉంది. క్రికెట్ లవర్స్‌ను అలరించే విధంగా ప్లేయర్‌గా నాని స్టిల్స్ మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఓవరాల్‌గా సినిమాపై భారీ అంచనాలు ఏర్పడే దిశగా పాట రూపొందిందనే ఫీలింగ్ కలిగింది.

నటీనటులు, సాంకేతికవర్గం
నటీనటులు: నాని, శ్రద్ధా శ్రీనాథ్ తదితరులు
దర్శకత్వం, రచన: గౌతమ్ తిన్ననూరి
నిర్మాత: నాగవంశీ
సమర్పణ: పీడీవీ ప్రసాద్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
డీవోపీ: సాను జాన్ వర్గీస్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొళ్ల
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్


Click it and Unblock the Notifications











