‘టక్ జగదీష్’ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్: ఆకట్టకుంటోన్న ‘ఇంకోసారి’ లిరికల్ వీడియో
స్వయంకృషితో సినిమాల్లోకి ప్రవేశించి.. అద్భుతమైన టాలెంట్‌ను చూపించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు నేచురల్ స్టార్ నాని. కెరీర్ ఆరంభంలోనే యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలను పోషించి.. ప్రేక్షకుల మనసు దోచుకున్న అతడు.. పలు విజయాలను అందుకుని సత్తా చాటాడు. జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఏకంగా మూడు సినిమాలను ప్రకటించి షాకిచ్చాడు. అందులో 'టక్ జగదీష్' ఒకటి. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాట విడుదలైంది.
'నిన్ను కోరి' వంటి సూపర్ డూపర్ హిట్ మూవీ తర్వాత నాని - శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'టక్ జగదీష్'. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా 'ఇంకోసారి ఇంకోసారి' అని సాగే లిరికల్ వీడియో రిలీజ్ అయింది. రీతూ వర్మ - నాని మీద తీసిన ఈ సాంగ్ రొమాంటిక్ టచ్‌తో కూడి ఉంది. దీనికి ఎస్ ఎస్ థమన్ అందించిన సంగీతం ఆకట్టుకుంటోంది.

ఇక, ఈ పాటను చైతన్య ప్రసాద్ రాయగా.. శ్రేయా గోషల్, కాల భైరవ ఆలపించారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇదిలా ఉండగా.. నాని కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా నుంచి పలు పోస్టర్లు విడుదల అవగా.. వాటి అన్నింటికీ విపరీతమైన స్పందన వచ్చింది. ఇక, ఈ చిత్రం ఏప్రిల్ 16న విడుదల కానుంది. ఇందులో జగపతిబాబు, రావు రమేష్ సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











