‘కోలో కోలమ్మ కోలో’ అంటోన్న నాని: ఆలోచింపజేసేలా ‘టక్ జగదీష్’ పాట
కొద్ది రోజులుగా టాలెంటెడ్ హీరో నేచురల్ స్టార్ నాని ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు. కనీసం ఏడాది రెండు మూడు సినిమాలనైనా చేసుకుంటూ వచ్చిన అతడు.. ఈ మధ్య కాలంలో వేగాన్ని తగ్గించేశాడు. ఇక, లాక్‌డౌన్ కారణంగా గత ఏడాది అతడి సినిమా ఒక్కటే విడుదల అయింది. దీంతో అతడి అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా స్పీడు పెంచిన అతడు ప్రస్తుతం ఏకంగా మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో 'టక్ జగదీష్' ఒకటి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ పాటను విడుదల చేశారు.
'నిన్ను కోరి' వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న చిత్రమే 'టక్ జగదీష్'. తాజాగా ఈ సినిమాలోని 'కోలో కోలమ్మ కోలో' అనే పాట విడుదలైంది. 'నువ్వు దీనంగా ఏ మూలో కూర్చుంటే.. నిన్ను వెంటడే దిగులే పడిపోతుందా' అంటూ మోటివేట్ చేసే ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం సమకూర్చిన ఈ పాటకు.. సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించారు. అమ్రాన్ మాలిక్, హరిణి దీన్ని ఆలపించారు. ఇక, ఇందులో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి.

నాని కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'టక్ జగదీష్'ను షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు. వీళ్లతో పాటు జగపతిబాబు, రావు రమేష్, నరేష్ సహా ఎంతో మంది కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ఊహించని రీతిలో స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం బిజినెస్ కూడా జరుగుతోంది. ఇక, ఈ సినిమా ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











