సర్‌ప్రైజింగ్‌గా సరిపోదా శనివారం సాంగ్.. నాని నుంచి అస్సలు ఊహించని విధంగా!
తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలు మాత్రమే వరుసగా హిట్లను అందుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అందులో నేచురల్ స్టార్ నాని ఒకడు. ఆ మధ్య కాస్త తడబడిన ఈ టాలెంటెడ్ స్టార్.. 'దసరా' మూవీతో సెన్సేషనల్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ వెంటనే 'హాయ్ నాన్న' అనే ఫీల్ గుడ్ మూవీతో మరో సక్సెస్ సాధించాడు. ఈ జోష్‌లో మరిన్ని చేస్తున్నాడు.
చాలా రోజుల క్రితమే హీరో నాని తన 31వ సినిమా 'సరిపోదా శనివారం'ను కూడా లైన్‌లో పెట్టేశాడు. దీన్ని 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా', 'అంటే సుందరానికీ' వంటి క్రేజీ మూవీలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని రూపొందిస్తున్నారు.

నేచురల్ స్టార్ నాని - వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'సరిపోదా శనివారం' మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే చాలా వరకూ టాకీ పార్టును చిత్ర యూనిట్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే, మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ఈ చిత్రాన్ని ఆగస్టు 29న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
డిఫరెంట్ సబ్జెక్టుతో రూపొందుతోన్న 'సరిపోదా శనివారం' మూవీ నుంచి ఇటీవలే కొన్ని గ్లింప్స్ వీడియోలు విడుదల అయ్యాయి. వీటికి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా లభించింది. ఫలితంగా ఈ చిత్రంపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి తాజాగా మొదటి పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
'సరిపోదా శనివారం' మూవీ నుంచి తాజాగా విడుదలైన మొదటి పాటను జేక్స్ బిజోయ్ కంపోజ్ చేశాడు. దీనికి సనపాటి భరద్వాజ్ పాత్రుడు లిరిక్స్ ఇవ్వగా విశాల్ దల్దానీ ఆలపించాడు. ఆద్యంతో కొత్త బీట్‌తో ఊరమాస్ విజువల్స్‌తో సాగిన ఈ పాటలో హీరో పాత్రను ఎలివేట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ పాట అస్సలు ఊహించని విధంగా ఉందని చెప్పొచ్చు.
ఇదిలా ఉండగా.. నాని - వివేక్ ఆత్రేయ కలయికలో రాబోతున్న 'సరిపోదా శనివారం' మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఎస్‌జే సూర్య విలన్ పాత్రను చేస్తున్నారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











