నన్నుదోచుకుందువటే లిరికల్ వీడియోకు మంచి రెస్పాన్స్.. సుధీర్‌బాబు హిట్టు ఖాయమా?
తెలుగు ప్రేక్షకుల్ని 'సమ్మోహనం' చేసిన సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే.. ఈ చిత్రంలోని "మౌనం మాటతోటి".... అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. విడుదల చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ పాడిన పాట ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. ఈ పాటకు గేయ రచయిత శ్రీ మణి సాహిత్యమందించారు. విజయ్ మాస్టర్ ఈ పాటకు నృత్యాలు సమసకూర్చారు. కొరియోగ్రఫి చేశారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ తో సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ పాటతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉండడం... హీరో, హీరోయిన్ పెర్ ఫార్మెన్స్ ఫ్రెష్ గా అనిపించడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఆఫీస్ మొత్తం భయపడే సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజర్ గా సుధీర్‌బాబు నటించగా.. అల్లరి చేసే గడుసమ్మాయి సిరి పాత్రలో హీరోయిన్ నభా నటేశ్ కనిపించింది.
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రెడీ అవుతున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నికార్యక్రమాలు పూర్తిచేసి వినాయచవితి పర్వదినాన సెప్టెంబర్ 13న విడుదల చేయాటానికి సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 12న స్పెషల్ ప్రీమియర్ షోలను ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ... సుధీర్ బాబు గారు హీరోగా సుధీర్ బాబు ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న నన్నుదోచుకుందువటే చిత్రానికి సంబంధించిన టీజర్ ని జులై 14న రిలీజ్ చేశాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు "మౌనం మాటతోటి" లిరికల్ వీడియోను విడుదల చేశాం. అజనీష్ అద్బుతమైన సంగీతం అందించారు. ఈ పాటను ఆయనే పాడటం విశేషం. శ్రీమణి గారు మంచి మెలోడియస్ సాహిత్యం అందించారు. ఈరోజు విడుదల చేసిన పాటతో ఈ చిత్రంలోని మిగిలిన పాటలు ఎలా ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
సుధీర్ బాబు గారి ఫస్ట్ ప్రొడక్షన్ లో నన్ను నమ్మి, నా కథను నమ్మి అవకాశం ఇచ్చారు. సమ్మోహనం సూపర్ హిట్ అయిన తర్వాత నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన సుధీర్ బాబు గారికి స్పెషల్ గా థాంక్స్ తెలియజేస్తున్నాను. సినిమా అనుకున్న ప్రకారం పూర్తి చేశాం. సినిమా మీదున్న నమ్మకంతో ప్రమోషన్ ను కూడా భారీగా ప్లాన్ చేశాం. అందుకు ఈ చిత్ర ప్రమోషన్ లో తెలుగు ప్రేక్షకులందరినీ ఇన్‌వాల్వ్ చేస్తున్నాము. అలాగే ఈ చిత్రం ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గకూడదనే సంకల్పంతోనే సుధీర్‌బాబు గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. అని అన్నారు.
నటీనటులు
సుధీర్ బాబు, నభా నటేశ్, నాజర్, తులసి, వేణు, రవి వర్మ, జీవా, వర్షిణి, సౌందర రాజన్, సుదర్శన్ తదితరులు
సాంకేతిక వర్గం
డిఓపి - సురేష్ రగుతు
మ్యూజిక్ డైరెక్టర్ - అజనీష్ బి లోకనాథ్
ఆర్ట్ డైరెక్టర్ - శ్రీకాంత్ రామిశెట్టి
ఎడిటర్ - ఛోటా కె ప్రసాద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎస్. సాయి వరుణ్
నిర్మాత - సుధీర్ బాబు
స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ - ఆర్ ఎస్. నాయుడు


Click it and Unblock the Notifications











