National Film Awards: రచ్చ గెలిచిన జానీ మాస్టర్..ఎలాంటి పాటలకు స్టెప్పులేయించాడో తెలుసా?

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రకటించే జాతీయ ఉత్తమ పురస్కారాలను అట్టహాసంగా వెల్లడించింది. 70వ జాతీయ చలన చిత్ర అవార్డులు 2024 ప్రకటిస్తూ.. ఉత్తమ నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించింది. ఈ అవార్డుల్లో పెద్దగా తెలుగు సినిమాల పేర్లు వినిపించకపోయినా.. తెలుగు తేజం జానీ మాస్టర్ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు లభించింది. తెలుగులో కార్తీకేయ 2 చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు వరించింది. అయితే ఈ వివరాల్లోకి వెళితే..

గతేడాది రిలీజైన తిరుచిత్రాంబలళం సినిమాకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ పనిచేశారు. ఆ సినిమాలోని పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. అంతేకాకుండా ఆ పాటలపై హీరో, హీరోయిన్లతో వేయించిన స్టెప్పులు కూడా భారీ స్పందన వచ్చింది. ఎప్పుడూ స్పీడ్ పాటలకు స్టెప్పులేయించే జానీ మాస్టర్ స్లో మోషన్‌లో వేయించిన స్టెప్పులు అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా అవార్డు కూడా తెచ్చిపెట్టింది.

National Film Awards 2004 winner Jani Master Songs List Here is the complete bio

విమర్శకుల ప్రశంసలు అందుకొన్న తిరుచిత్రాంబళం సినిమాలో ధనుష్, నిత్య మీనన్ జంటగా నటించారు. ఈ సినిమాలోని మేఘం కరుకతా అనే పాటకు జానీ మాస్టర్ కోరియోగ్రఫిని అందించారు. ఈ పాట యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధించింది. తాజాగా ఈ సినిమా పాటకు నృత్య సమకూర్చిన జానీ మాస్టర్‌ను కేంద్ర ప్రభుత్వం ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డును ప్రకటించడంపై సంగీత అభిమానులు సంతోషాన్ని అందించారు.

అయితే తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన జానీ మాస్టర్ గత కొద్దికాలంగా తమిళ సినిమా రంగంలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకొన్నారు. విజయ్, ధనుష్, రజనీకాంత్ లాంటి అగ్ర హీరోలతో స్టెప్పులేయిస్తున్నాడు. ఏకంగా ఇంట గెలిచిన జానీ మాస్టర్.. ఇప్పుడు రచ్చ గెలిచి టాలీవుడ్ ప్రతిష్టను పెంపొందించారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి.

జానీ మాస్టర్ విషయానికి వస్తే.. రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి, క్రాక్ సినిమాలో భూమ్ బద్దల్, కన్నడ చిత్రం విక్రాంత్ రోనాలో రా రా రక్కమ్మ పాట, బీస్ట్‌లో అరబిక్ కుతూ, ది వారియర్ చి్తరంలో విజిల్ సాంగ్, వారిసు చిత్రంలో రంజితమే, జైలర్ చిత్రంలో కావాలా? మాచెర్ల నియోజకవర్గంలో రారా రెడ్డి, పుస్ప చిత్రంలో శ్రీవల్లి పాటలకు కొరియోగ్రఫి చేశారు. ప్రస్తుతం ఆయన కొరియోగ్రఫి అందించిన గేమ్ చేంజర్ రిలీజ్ కావాల్సి ఉంది. అలాగే ఆయన త్వరలో హీరోగా ఓ సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X