Nayanatara షారుక్ ఖాన్ కెమిస్ట్రీ అదుర్స్.. ఛలోనా అంటూ ఫుల్లుగా నయనతార రొమాన్స్
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, సౌత్ ఇండియా లేడి సూపర్ స్టార్ నయనతార నటించిన జవాన్ చిత్రం రోజు రోజు అంచనాలు పెంచుతున్నది. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్ ఈవెంట్స్ సినిమాపై క్రేజ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో షారుక్ సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఈ సినిమాను గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ నిర్మించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా పాటను ఆగస్టు 14వ తేదీన రిలీజ్ చేశారు. ఈ పాటకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
నయన్‌తో షారుక్ రొమాంటిక్‌గా: జవాన్ సినిమా నుంచి ఛలోనా అనే పాటను ప్రేక్షకులు, అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. ఈ పాటలో అందాల భామ నయనతారతో షారుక్ ఖాన్ రొమాంటిక్‌గా స్టెప్పులేస్తూ కనిపించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ పాటను ఆదిత్య ఆర్కే, ప్రియా మాలి ఆలపించారు. షారుక్ ఖాన్ స్టెయిల్, స్వాగ్ ఈ పాటకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. ఈ పాట ద్వారా అభిమానులకు, సినీ ప్రేక్షకులకు షారుక్ ఖాన్ తన మ్యాజిక్ పరిచయం చేశారు.

ప్రేమ కొలవలేనిది అంటూ: షారుక్ ఖాన్ తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పాట గ్లింప్స్‌ను షేర్ చేశారు.. ప్రేమ కొలవలేనిది. హద్దులు లేనిదై ఉండాలి. అటువంటిదే జవాన్ ప్రేమ. జవాన్ సినిమా నుంచి ఛలోనా పాట రిలీజైంది అంటూ షారుక్ ట్వీట్ చేశారు. ఈ పాటలో షారుక్, నయన్ చేతిలో చేయి వేసి తన్మయత్వంతో ఊగిపోయారు. నయనను అమాంతం లేపేసి రొమాంటిక్ స్టెప్పలేశాడు. పసుపుపచ్చ డ్రస్సులో, ప్రింటెండ్ క్యాస్టూమ్‌లో నయనతార మరింత అందంగా కనిపించింది.

బాలీవుడ్‌లోకి తొలిసారి నయనతార: దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా పేరు ఉన్న నయనతార తొలిసారి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంలోనే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌తో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఛలోనా పాటలో వారిద్దరి కెమిస్ట్రీ ఫ్రెష్‌గా కనిపించింది. ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ఫరా ఖాన్ ఈ పాటకు కొరియోగ్రఫిని అందించారు. తెలుగులో ఈ పాటను ఆస్కార్ అవార్డు విజేత చంద్రబోస్ రాయడం విశేషంగా మారింది.

జవాన్ రిలీజ్ ఎప్పుడంటే?: విజయ్ సేతుపతి, యోగిబాబు, దీపిక పదుకోన్, ప్రియమణి నటించిన జవాన్ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. సుమారు 250 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











