డియర్ కామ్రేడ్ వీడియో సాంగ్ రిలీజ్.. 'నీ నీలి కన్నుల్లోన ఆకాశమే'
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న క్రేజీ జోడీ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 26 వ తేదీన విడుదలైన బాక్సాఫీసు వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. విడుదలకు ముందు క్రియేట్ అయినా బజ్ పూర్తి స్థాయిలో అందుకోలేక పోయిందనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. సినిమా రన్ టైమ్ ఎక్కువగా ఉండటం, స్లో నేరేషన్ వల్ల ప్రేక్షకులు కాస్త అసహనానికి గురవుతున్నట్లు తెలిసింది. అయినప్పటికీ డీసెంట్ రన్ కొనసాగిస్తున్న ఈ సినిమా పట్ల చిత్రయూనిట్ సంతోషంగా ఉంది.
కాగా తాజాగా ఈ సినిమాలోని 'నీ నీలి కన్నుల్లోన ఆకాశమే' వీడియో సాంగ్ విడుదల చేసి ఆకట్టుకుంది చిత్రయూనిట్. విజయ్ దేవరకొండ, రష్మిక లతో తెరకెక్కించిన ఈ పాటలో ఇద్దరి అభినయం హైలైట్ అయింది. డియర్ కామ్రేడ్ చిత్రంలో ఈ సాంగ్ కి అశేష ఆదరణ రావడంతో సోషల్ మీడియాలో అందుబాటులోకి తెచ్చారు. గౌతమ్ భరధ్వాజ్ పాడిన ఈ పాటకు జస్టిన్ ప్రభాకరన్ అందించిన సంగీతం ప్రాణం పోసింది. విడుదలైన కాసేపట్లోనే వేగంగా వ్యూస్ రాబడుతూ దూసుకుపోతోంది ఈ వీడియో సాంగ్.

భరత్ కమ్మ దర్శకత్వం వహించిన డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. విడుదలకు ముందు ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 34.60 కోట్లకు అమ్మారు. ఫస్ట్ వీకెండ్ రూ. 18.81 కోట్లు వసూలు చేసింది. సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా వరల్డ్ వైడ్ షేర్ రూ. 15 కోట్లకుపైగా వసూలు చేయాల్సి ఉంది. సెకండ్ వీకెండ్ పూర్తయ్యే సమయానికి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ పాయింటును రీచ్ అవుతుందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.


Click it and Unblock the Notifications











