చిన్న సినిమాకు పెద్ద రికార్డ్.. ఆనందంలో యాంకర్ ప్రదీప్

బుల్లితెరపై యాంకరింగ్‌లో సరికొత్త ఒరవడిని తీసుకొచ్చి.. సుమకు ధీటుగా ఎదిగాడు యాంకర్ ప్రదీప్. యాంకర్స్ అంటే కేవలం ఆడవారు ఉంటారనే భ్రమను తొలగించి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రదీప్ ఓ ట్రెండ్ సెట్ చేశాడు. అటు బుల్లితెరపై తన టైమింగ్‌తో ఆకట్టుకున్న ప్రదీప్.. అప్పుడప్పుడూ వెండితెరపైనా మెరిశాడు. అయితే ప్రస్తుతం పూర్తి స్థాయి హీరోగా మారిపోయాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రంతో హీరోగా పరిచయం కానున్నాడు.

అంతా బాగుండి ఉంటే.. ఈ పాటికే ప్రదీప్ వెండితెరపై వీరంగం సృష్టించేవాడు. కరోనా విజృంభించడం, లాక్ డౌన్ విధించడం, చిత్రపరిశ్రమ స్థంభించిపోవడంతో అంతా తారుమారైంది. అనుకున్న సమయానికి చిత్రాన్ని విడుదల చేయలేకపోయారు. అయితే ఈ సినిమాపై ఇంతటి క్రేజ్ ఏర్పడటానికి కారణం మాత్రం ఆ ఒక్క పాటే. అనూప్ రూబెన్స్ అందించిన చక్కటి మెలోడి గీతాల్లో ముందు వరుసలో నిలిచేంతా సత్తా ఉంది.

Neeli Neeli Aakasam Reached 150 million Views

నీలి నీలి ఆకాశం అనే పాట అప్పట్లో ఓ సంచలనం. అల వైకుంఠపురములో పాటలు రాజ్యమేలుతున్న తరుణంలోనూ ఈ సాంగ్ అందర్నీ ఓ ఊపు ఊపేసింది. ఈ ఒక్క పాటతో సినిమాపై అంచనాలు ఆకాశన్నంటాయి. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. సిద్ శ్రీరామ్, సునీత కలిసి ఆలపించారు. ఈ పాటలోని సాహిత్యం, బాణీ అందర్నీ ఆకట్టుకుంది.

ఇప్పటికీ ఈ పాట యూట్యూబ్‌లో మార్మోగుతూనే ఉంది. తాజాగా ఈ పాట కొత్త రికార్డులను అందుకుంది. 150 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుని ఈ చిన్న సినిమాకు కొండంత అండగా నిలబడింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపింది. ఈ చిత్రంలో ప్రదీప్ మాచిరాజు సరసన అమృతా అయ్యర్ నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X