అరుదైన రికార్డ్.. ‘నీలి నీలి ఆకాశం’ రచ్చ మామూలుగా లేదే!
ఓ చిన్న సినిమా అందరి దృష్టిని ఆకర్షించడం మామూలు విషయం కాదు. ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకట్టుకోవడం ఒకెత్తు అయితే.. తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకోవడం, అది కూడా ఒకే ఒక్క పాటతో సినిమా రేంజ్ మారిపోవడం అంటే అషామాషీ కాదు. బుల్లితెర యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయం కాబోతోన్న మొదటి చిత్రం కేవలం పాటలతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రేజీగా మారిపోయింది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.
30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలోని నీలి నీలీ ఆకాశం అనే పాట ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. అల వైకుంఠపురములో పాటల తరువాత మళ్లీ ఆ స్థాయి గుర్తింపు, అంతగా ఫేమస్ అయిన పాటగా నీలి నీలీ ఆకాశం నిలిచింది. పాట రచయితగా చంద్రబోస్, సింగర్స్‌గా సిద్ శ్రీరామ్, సునీతలకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ పేరు మార్మోగిపోయింది.

తాజాగా ఈ పాట రెండు వందల మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. సినిమా రిలీజ్ కాకుండానే సాంగ్ ఇంతటి సక్సెస్ కావడం, విడుదలకు ముందే రెండు వందల మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టడం ఇది సౌత్‌లో గొప్ప రికార్డ్ అట. ఈ మేరకు చిత్ర యూనిట్ తెగ సంబరపడిపోతోంది. ఈ విషయాన్ని చెబుతూ.. ఈ పాటను ఇంత పెద్ద హిట్ చేసినందుకు సంగీత ప్రియులందరికీ అనూప్ రూబెన్స్ థ్యాంక్స్ చెప్పాడు. ఇక ఈ సినిమాకు ఎప్పుడు మెక్షం కలుగుతుందో చూడాలి. థియేటర్లు ఓపెన్ కావాలంటే ఇంకాస్త సమయంల పట్టేలానే కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











