Mahesh Babu: ఏందయ్యా ఇది.. మహేశ్ బాబుతో ఫ్రస్టేషన్ స్టెప్స్... సూపర్ స్టార్ ఇమేజ్ దిగజారేలా?
సూపర్ స్టార్ మహేశ్ బాబు.. డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా తర్వాత వస్తున్న వీరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో... భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి కుర్చీ మడతపెట్టి సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే సాంగ్ అయితే వైరల్ అవుతుంది కానీ... దీని మీద విపరీతంగా ట్రోలింగ్స్ వస్తున్నాయి. ఈ పాట మహేశ్ బాబు ఇమేజ్ ను దిగజారేలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆ వివరాల్లోకి వెళితే...
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సాంగ్ విపరీతంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ మోస్ట్ అవైటెట్ మూవీ గుంటూరు కారంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శుక్రవారం విడుదలైన ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ అయితే వస్తుంది కానీ విపరీతంగా ట్రోలింగ్ మొదలు అయింది.

అడియన్స్ అస్సలు ఊహించని డైలాగ్ ను మహేష్ బాబు సినిమాకు సాంగ్ చేయడం అందరినీ షాక్ కు గురి చేసింది. మరోవైపు కొందరు ఫ్యాన్స్ మాత్రం ఈ పాటపై ఫైర్ అవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ అంటే పాన్ ఇండియా లెవెల్. ఆయన ఒక్క పాన్ ఇండియా సినిమా తీయకపోయినా.. ఆ లెవెల్ క్రేజ్ అయితే ఉంది. అలాంటి స్టార్ హీరో సినిమాలో ఇలాంటి పదాన్ని వాడడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ఇక కుర్చీ మడతపెట్టి సాంగ్ కు రెస్పాన్స్ బాగానే ఉన్నప్పటికీ... సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు అయింది. ఈ పాట మహేశ్ బాబు స్టార్ ఇమేజ్ దిగజారేలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. తమన్ పాట రిలీజ్ చేయమంటే... మీమ్ రిలీజ్ చేశారేంటి అంటూ తమన్ పై ట్రోలింగ్ మొదలు పెట్టారు. స్టార్ హీరోతో అలాంటి డైలాగులు చెప్పించడం ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు.
మాస్ బీట్ తో సాగే ఈ పాటలో మహేష్, శ్రీలీల స్టెప్పులకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఫుల్ ఎనర్జిటిక్ గా మాస్ స్టెప్పులతో రఫ్పాడించారు మహేశ్ బాబు శ్రీలీల. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో కుర్చీ మడతపెట్టి డైలాగ్ మళ్లీ ట్రెండింగ్ గా మారింది. గతంలో ఓ పెద్దాయన మాట్లాడిన మాటలు.. నెట్టింట బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆయన కుర్చీ కథ చెబుతూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. ఇక ఆయన మాటను ఇప్పుడు పాటగా మార్చారు.
ఈ పెద్దాయన డైలాగ్ వాడినందుకు తమన్... కుర్చీ తాతకు పారితోషికం కూడా ఇచ్చారట. 5వేల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఏదిఏమైనా ఓ సోషల్ మీడియా మీమ్ డైలాగ్ ను స్టార్ హీరో సినిమాలో వాడటం హాట్ టాపిక్ గా మారింది. గుంటూరు కారం సినిమాలో హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











