నోరా ఫతేహి సాంగ్‌లో అశ్లీల సాహిత్యం.. దేశంలో సెన్సార్ బోర్డు ఉందా? నెటిజన్ల ఆగ్రహం
కన్నడ సినీ రంగంలో యాక్షన్ ప్రిన్స్ ధ్రువ్ సర్జా నటించిన తాజా చిత్రం కేడీ: ది డెవిల్. దర్శకుడు ప్రేమ్స్ డైరెక్షన్‌లో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, శిల్పాశెట్టి, వీ రవిచంద్రన్, రమేష్ అరవింద్, రీష్మా నానయ్య తదితరులు నటిస్తున్నారు.
ఈ సినిమాకు అర్జున్ జన్య మ్యూజిక్ అందిస్తుండగా, విలియం డేవిడ్ సినిమాటోగ్రఫిని, మోహన్ బీ కెరే ఆర్ట్ డైరెక్టర్‌గా, రాజు సుందరం, ప్రభుదేవా, రాహుల్ తదితరులు కోరియోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ను భారీగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ గ్లామర్ డాల్ నోరా ఫతేహీ, సంజయ్ దత్‌పై చిత్రీకరించిన పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ పాటకు సంబంధించిన తెలుగు, హిందీ సాహిత్యం గురించిన వివరాల్లోకి వెళితే..

నోరా ఫతేహీ, సంజయ్ దత్ జంటపై జరిపేయ్ నాత్ పండుగ జరిపేయ్ అంటూ సాగే పాట మాస్ బీట్‌తో యూత్‌ను టార్గెట్ చేసే విధంగా డిజైన్ చేశారు. ఈ పాటలో రాజు సుందరం కంపోజ్ చేసిన స్టెప్పులు, వాటిని తెరకిక్కించిన విధానం చర్చనీయాంశమైంది. నోరా గ్లామర్ ట్రీట్ స్క్రీన్‌పై ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య కంపోజ్ చేసిన మాస్ సాంగ్‌ను సింగర్ మంగ్లీ ఆలపించారు. ఈ పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్ర బోస్ సాహిత్యం అందించారు. తెలుగులో పాట సరళంగా, వినసొంపుగా ఉంది అనే అభిప్రాయం సంగీత ప్రియుల నుంచి వస్తున్నది.
అయితే ఈ సినిమాలోని హిందీ వెర్షన్ పాట వివాదాస్పదంగా మారింది. ఈ పాటలోని సాహిత్యం అసభ్యత, అశ్లీలత ఎక్కువైందనే విషయంపై సోషల్ మీడియాలో కామెంట్స్ వినబడుతున్నాయి. ఈ పాట విషయానికి వస్తే.. పహ్లే ఉఠాలే.. అందర్ వో డాలే.. నీచే ఏక్ బుంద్ నా గిరాయే..కర్కే నికాలే ఖాళీ..ముఝ్ పే గిరేనా లగ్తా హై డర్.. అంటూ ఈ పాట సాగుతుంది. అయితే పూర్తిగా ద్వందార్థం ఉట్టిపేడేలా పాట సాహిత్యం ఉంది. ఈ పాటను రాకీబ్ ఆలమ్ రాయగా,.. సత్యవతి రాథోడ్ అలియాస్ మంగ్లీ ఆలపించారు.
అయితే ఈ పాట సాహిత్యంపై నెటిజన్ల తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ దేశంలో సెన్సార్ బోర్డు ఉందా? సెన్సార్ నిబంధనలు అమలు అవుతున్నాయా? ఇంత వల్గర్, డబుల్ మీనింగ్ సాంగ్స్‌ను మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఎలా అనుమతించారు అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ పాటపై సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











