Karthikeya 2 వీడియో సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే? నిఖిల్, అనుపమ రొమాంటిక్ మూడ్‌తో..

యువ హీరో నిఖిల్, చందు మొండేటి కాంబినేషన్‌లో తెరకెక్కిన కార్తీకేయ చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. సినీ ప్రేక్షకులు, విమర్శకులను మెప్పించిన ఈ సినిమాకు సీక్వెల్‌గా కార్తీకేయ 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే రిలీజైన టీజర్లు, ట్రైలర్లకు భారీ స్పందన వచ్చింది. శంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది.. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం అంటూ అదిరిపోయే డైలాగ్స్‌తో సాగే ట్రైలర్ ఆకట్టుకుంటున్నది. కాలభైరవ బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు అదనపు ఆకర్షణగా మారింది. ప్రతీ ఫ్రేమ్ చాలా అద్భుతంగా చూపించారు సినిమాటోగ్రఫర్ కార్తికే ఘట్టమనేని. టాలెంటెడ్ టెక్నీషియన్స్‌తో అద్బుతమైన అవుట్‌పుట్‌ను దర్శకుడు చందూ మొండేటి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Nikhil Siddharth Karthikeya 2 video song to be released on July 12th

కార్తీకేయ 2 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను నేను అడిగా వీడియో సాంగ్‌ను జులై 12 సాయంత్రం 5.30 గంటలకు Zee Music South లో విడుదల కానుంది.

కార్తికేయ 2 చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని జులై 22న ప్ర‌పంచ‌వ్యాప్తంగా కార్తికేయ 2 చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

నటీనటులు: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ తదితరులు
క‌థ‌, స్క్రీన్‌ ప్లే, ద‌ర్శ‌క‌త్యం: చందు మెుండేటి
బ్యాన‌ర్: పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌
కో-ప్రొడ్యూస‌ర్: వివేక్ కూచిభొట్ల
నిర్మాత‌లు: టీజీ విశ్వ ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌
మ్యూజిక్: కాలభైరవ
సినిమాటోగ్రాఫర్: కార్తీక్ ఘట్టమనేని
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
పీఆర్వో: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X