అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు.. ఇదో క్రైం అంటూ షాకిచ్చిన నాని
అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా? ఇదో క్రైం అనేసి షాకిచ్చాడు హీరో నాని. అదేంటి.. నాని ఇలా కూడా మాట్లాడతారా? అనుకుంటున్నారు కదూ. అయితే ఇది రియల్ లైఫ్ లో కాదులెండి. తన కొత్త సినిమా గ్యాంగ్ లీడర్ లో ఇదో డైలాగ్. వినాయక చవితి సందర్బంగా గ్యాంగ్ లీడర్ నుంచి లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ మొదట్లోనే నాని, అమ్మాయిల గురించి ఈ డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు.
'నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే' అంటూ సాగిపోతున్న ఈ పాతును సిద్ శ్రీరామ్ ఆలపించగా, అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. యువ హృదయాలను ఆకట్టుకుంటూ ఈ సాంగ్ యూ ట్యూబ్ లో వేగంగా వ్యూస్ రాబడుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన గ్యాంగ్ లీడర్ టీమ్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఇటీవలే విడుదల చేసిన గ్యాంగ్ లీడర్ ట్రైలర్ విశేష స్పందన తెచ్చుకొని సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' సినిమా రూపొందింది. చిత్రంలో నాని హీరోగా నటించగా.. మేఘా ఆకాష్, ప్రియాంక అరుళ్ అనే ఇద్దరు భామలు నాని సరసన నటించారు. Rx 100 ఫేం కార్తికేయ నెగెటివ్ రోల్ పోషించాడు. అనిరుద్ రవిచంద్రన్ బాణీలు కట్టారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











