దేవీ శ్రీ ప్రసాద్ ఈజ్ బ్యాక్: అదరగొడుతోన్న ‘రంగ్ దే’ బస్టాండే బస్టాండే సాంగ్
కొంత కాలంగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ టాలెంటెడ్ హీరో నితిన్. జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రాజెక్టులను పట్టాలెక్కించే అతడు.. గత ఏడాది లాక్‌డౌన్‌కు ముందు 'భీష్మ'తో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏకంగా మూడు ప్రాజెక్టులతో రెడీ అవుతున్నాడు. వాటిలో ఇప్పటికే చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన 'చెక్' ప్రేక్షకుల ముందుకు రాగా.. వెంకీ అట్లూరి రూపొందిస్తోన్న 'రంగ్ దే' మాత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాలోని 'బస్టాండే బస్టాండే' అంటూ సాగే పాటను తాజాగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన 'బస్టాండే బస్టాండే' పాటను అతడి సోదరుడు సాగర్ ఆలపించాడు. శ్రీమణి లిరిక్స్ అందించాడు. స్టైలిష్‌గా సాగే ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంతేకాదు, పాత డీఎస్పీని గుర్తుకు తెస్తోంది. ఇక, ఇందులో పిక్చరైజేషన్ కూడా చాలా రిచ్‌గా ఉంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ కెమెరా స్కిల్స్ మరో ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. వీటికి తోడు నితిన్ డ్యాన్స్ మూమెంట్స్ కూడా మెప్పిస్తున్నాయి. దీంతో ఈ పాట సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వ్యూస్ అందుకుంటూ దూసుకుపోతోంది. తద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ లైకులను కూడా అందుకుంది.

నితిన్ కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'రంగ్ దే'ను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటించారు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీన్ని మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.


Click it and Unblock the Notifications











