Don't Miss!
- News
బీజేపీ నేత ఇంటిపైకి బుల్డోజర్ పంపిన యోగి ఆదిత్యనాథ్: మహిళపై దాడే కారణం
- Sports
India Squad For Asia Cup: ఇదేం సెలెక్షన్ నాయనా.. జట్టు ఎంపికలో బ్లండర్ మిస్టేక్స్..!
- Technology
Realme Watch 3 Pro ఇండియా లాంచ్ వివరాలు వచ్చేసాయి. స్పెసిఫికేషన్లు చూడండి.
- Lifestyle
మీ వంటగదిలో ఉండే ఈ 8 వస్తువులు మీ జుట్టును పొడవుగా మరియు మెరిసేలా చేయగలవని మీకు తెలుసా?
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
- Finance
Vizag Housing: విశాఖలో విపరీతంగా పెరిగిన ఇళ్ల ధరలు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఎస్బీఐ..
- Automobiles
19 రోజుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణం: బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో మంగళూరు వ్యక్తి అరుదైన రికార్డ్
Macherla Niyojakavargam: రారా రెడ్డి జోరు మామూలుగా లేదు.. నితిన్ మరో రికార్డు!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ మరో మాస్ కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మాచర్ల నియోజకవర్గం సినిమా ఈనెల 12వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. తప్పకుండా ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని నితిన్ ప్రమోషన్స్ డోస్ కూడా పెంచుతున్నాడు. అయితే ఈ క్రమంలో ఒకే ఒక్క మాటతోనే సినిమాకు మాస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
మొదట విడుదల చేసిన స్పెషల్ సాంగ్ 'రారా రెడ్డి' మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియా ఫ్లాట్ పామ్స్ లో కూడా చాలా వైరల్ గా మారిపోతుంది. ముఖ్యంగా యువత రారా రెడ్డి స్టెప్పులతో మంచి హైప్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా రారా రెడ్డి పాట ఇంటర్నెట్ ప్రపంచంలో మరొక సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు షార్ట్ వీడియో ఆప్స్ లో 500 మిలియన్ వ్యూవ్స్ అందుకోవడం విశేషం.

ఇటీవల కాలంలో ఏ పాట కూడా ఈ స్థాయిలో వైరల్ కాలేదు అనే చెప్పాలి. మాస్ ఆడియెన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నితిన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో మొదటిసారిగా నితిన్ ఒక పవర్ఫుల్ కలెక్టర్ ఆఫీసర్ కనిపించబోతున్నాడు. ట్రైలర్ తోనే సినిమాకు మంచి హైపర్ అయితే క్రియేట్ అయ్యింది.
ప్రతిరోజు రారా రెడ్డి పాట ఏదో ఒక రికార్డును అందుకుంటోంది. అంజలి స్పెషల్ సాంగ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆమె స్టెప్పులతో పాటు నితిన్ మాస్ స్టెప్పులు కూడా యువతను ఎంతగానో కట్టుకుంటున్నాయి. ఇక ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కూడా ఈ పాట బాగా వైరల్ అయింది.. మణిశర్మ కుమారుడు మహతి సాగర్ ఈ సినిమాకు సంగీతం అందించిన విషయం తెలిసిందే. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.