ఒకళ్లు కూడా సెట్ అవ్వలే.. కిస్సింగ్ కోసం.. హగ్గింగ్ కోసం వెయిటింగ్.. క్రేజీగా భీష్మ సింగిల్స్ ఆంథెమ్

యంగ్ హీరో నితిన్ హిట్ కొట్టి చాలా కాలమే అయింది. చివరగా అఆ చిత్రంలో మంచి విజయాన్ని చూసిన నితిన్‌కు మళ్లీ ఆరేంజ్ హిట్ పడలేదు. లై, చల్ మోహనరంగ, శ్రీనివాస కళ్యాణం లాంటి సినిమాలు చేసినా ఆశించిన సక్సెస్ మాత్రం దక్కలేదు. ఈ క్రమంలో ఈ యంగ్ హీరోకు ఆఫర్స్, క్రేజ్ ఇసుమంతైనా తగ్గడం లేదు. ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టిన నితిన్ ఈ సారి బాక్సాఫీస్‌పై దాడి చేసేలానే కనిపిస్తున్నాడు.

ఛలో హిట్ తరువాత భీష్మ..

ఛలో హిట్ తరువాత భీష్మ..

నితిన్-రష్మిక జంటగా రాబోతోన్న భీష్మ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఛలో వంటి సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల తన తదుపరి చిత్రంగా భీష్మ వంటి లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌ను ఎంచుకున్నాడు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

హీరో హీరోయిన్ కెమిస్ట్రీ హైలెట్..

హీరో హీరోయిన్ కెమిస్ట్రీ హైలెట్..

ఈ మూవీ నుంచి విడుదల చేసిన మోషన్ పోస్టర్, గ్లింప్స్ అంచనాలు పెంచేశాయి. నితిన్-రష్మిక మధ్య కెమిస్ట్రీ హైలెట్‌గా నిలవబోతోన్నట్లు తెలుస్తోంది. తాజాగా వీరిద్దరు రోమ్‌లో రొమాన్స్ చేసేందుకు చెక్కేశారు. అక్కడి అందమైన లొకేషన్లలో పాటలను చిత్రీకరించేందుకు చిత్రయూనిట్ వెళ్లింది.

మహతి స్వర సాగర్ సారధ్యంలో..

ఛలో వంటి మ్యూజికల్ హిట్ ఇచ్చిన మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ పేరు అప్పట్లో మార్మోగిపోయింది. వెంకీ కుడుముల-మహతిల కాంబినేషన్‌కు మంచి మార్కులు పడటంతో మళ్లీ వీరిద్దరు కలిసి భీష్మ కోసం పని చేస్తున్నారు. చూసి చూడంగానే లాంటి నెంబర్ వన్ పాటలను భీష్మ కోసం కంపోజ్ చేసినట్టు తెలుస్తోంది. అందులోంచి మొదటి సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు.

సింగిల్స్ ఆంథమ్..

సింగిల్స్ ఆంథమ్..

భీష్మ ఫరెవర్ సింగిల్ అంటూ ట్యాగ్ లైన్ పెట్టారు. దీనికి తగ్గట్టే సింగిల్స్ ఆంథమ్ అంటూ ఒంటరిగా బాధపడే మగవారికి అంకితమిచ్చేలా ఈ పాటను కంపోజ్ చేశారు. ఎంతమందిని ట్రై చేసినా ఒక్కరూ కూడా పడటం లేదనీ, ఓ ముద్దూ ముచ్చటా లేకుండా పోతోందని ఫ్రస్ట్రేట్ అయ్యే కుర్రాడి బాధను శ్రీమణి చక్కగా వర్ణించగా.. మహతి స్వర సాగర్ క్యూట్‌గా కంపోజ్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X