మెగా హీరోను కవ్విస్తున్న నోరా ఫతేహి.. లేలే రాజా అంటూ ఓ రేంజ్‌లో ఐటెమ్ సాంగ్!
టాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మించిన చిత్రం మట్కా. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి స్టెప్పులేసిన స్పెషల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజైన ఈ పాట వివరాల్లోకి వెళితే..
80 దశకం బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరీ, నోరా ఫతేహి, నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, మైమ్ గోపి, రూపాలక్ష్మీ, విజయ్ రామరాజు, జగదీష్, రాజ్ తిరందాస్ తదితరులు నటిసత్ున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఏ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు. కార్తీక్ శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో క్లబ్ సాంగ్‌గా రూపొందిన లేలే రాజా అనే పాటను వరుణ్ తేజ్, నోరా ఫతేహిపై డిస్కో స్టయిల్‌లో చిత్రీకరించారు. ఆ పాటకు సంబంధించిన సెట్, బ్యాక్ డ్రాప్ 80లోని జ్యోతిలక్ష్మీ, జయమాలిని, సిల్క్ స్మిత పాటలను మరోసారి గుర్తు చేసింది. మంచి బీట్‌తో సాగే ఈ సాంగ్‌కు భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించగా.. గాయని నీతీ మోహన్ ఆలపించారు.
వచ్చేసేయ్.. వచ్చేసేయ్..
లేలే రాజా.. లేత లేత రోజా
బోలో బోలో రాజా.. అందాల దర్వాజా
లేలే రాజా.. నేనే లేత కాజా
కన్నే కొట్టి లేజా.. కవ్విస్తా రాజా
ఓరగా. చూడగా.. కాకా రేగదా ప్రతీవాడికి
సన్నగా.. నవ్వగా.. మంటలేగదా మగజాతికి
లేలే రాజా.. లేత లేత రోజా
బోలో బోలో రాజా.. అందాల దర్వాజా
లేలే రాజా.. నేనే లేత కాజా
కన్నే కొట్టి లేజా.. కవ్విస్తా రాజా

మగవాళ్లు.. ఈ రకంగా మంచోళ్లు..
మంచోళ్లు కాబట్టే..మీకెన్నో కష్టాలు
కూసింత .. సుఖపడుదామనిపిస్తే..
ముస్తాబై నేనుంటా.. వెనుకేయలూ
కొంచెం జాయ్.. కొంచెం హాయ్
అంటూ సాగే పాట మంచి హుషారుగా యువతకు కితకితలు పెట్టేలా సాహిత్యం ఉండటమే కాకుండా నీతి మోహన్ రెచ్చగొట్టేలా గొంతుతో హొయలు ఒలికిస్తూ ఆలపించింది. ఈ పాట ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి వచ్చింది.


Click it and Unblock the Notifications











