సినిమా స్టోరీని తలపించిన సింగర్ దారుణ హత్య.. మూడు రోజుల తరువాత అసలు నిజం

చూడగానే అందమైన చిరునవ్వు అలాగే వినసొంపుగా ఉండే గానం ఆమె సొంతం. గాయనిగా నార్త్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును అందుకున్న ఒక సింగర్ ఇటీవల దారుణమైన హత్యకు గురైంది. ఆమె హత్యకు చేసిన ప్లాన్ సినిమా ట్విస్ట్ లను కూడా తలపించింది. ఎంతో నమ్మకంగా ఉండేవారే ఊహించని విధంగా హత్యకు కారణం కావడంతో తెలిసిన వారందరూ కూడా షాక్ అయ్యారు మూడు రోజుల పాటు పోలీసులను కూడా కన్ఫ్యూజ్ చేసిన ఈ హత్య ఇటీవల సంచలనంగా మారింది. అసలు ఆ గాయానికి ఎందుకు హత్య చేశారు? ఎలా జరిగింది అనే వివరాల్లోకి వెళితే..

మంచి గాయనిగా..

మంచి గాయనిగా..

ఢిల్లీకి చెందిన ప్రముఖ గాయని దివ్య ఇండోరా అలియాస్ సంగీత పలు ప్రైవేట్ ఆల్బమ్స్ తో మంచి గుర్తింపు అందుకుంది. ఎంతో కష్టపడి మంచి సింగర్ గా కూడా ఆమె కొన్ని సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. చిన్న వయసు నుంచే సంగీతంపై ఎంతో మక్కువ పెంచుకున్న సంగీత అందరితోనూ ఎంతో స్నేహభావంతో ఉండేదే. అయితే ఇటీవల ఆమె దారుణ హత్యకు గురవడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.

అనుమానం రాకుండా..

అనుమానం రాకుండా..


29 ఏళ్ల సంగీతను ఇద్దరు వ్యక్తులు కలిసి దారుణంగా హత్య చేశారు. వారు సంగీత వద్దనే గత కొన్నేళ్లుగా పని చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మొదట ఈ హత్య ఎవరు చేశారు అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ కూడా నెలకొంది. అసలు ఏ మాత్రం అనుమానం రాకుండా సంగీతను హత్య చేసినట్లుగా నిందితులు ఒప్పుకున్నారు. ముందస్తుగా ప్లాన్ ప్రకారమే సంగీతం హత్య చేసినట్లుగా కూడా వారు వివరణ ఇచ్చారు.

అనుమానంతో పిర్యాదు

అనుమానంతో పిర్యాదు

అయితే మే 11వ తేదీన కనిపించకుండా పోయిన సంగీత కోసం కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం వెళ్లిన ఆమె మళ్ళీ తిరిగి రాలేదు అని చెప్పడంతో పోలీసులు అన్నిరకాలుగా విచారణ చేపట్టారు. ఇక అనుమానంతో పోలీసులు వెంటనే ఆమె దగ్గర పనిచేస్తున్న అనిల్ రవి ఇద్దరినీ కూడా అరెస్టు చేసి విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది.

ఆ కారణంగా హత్య

ఆ కారణంగా హత్య

ఇక నిందితులను విచారించిన అనంతరం సంచలన విషయాలు బయటపడ్డాయి. పక్కా ప్రణాళికలతో సంగీతను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ఇక ఈ విచారణలో అసలు సూత్రధారి రవి అనే పోలీసులు తెలిపారు. అతని సూచనల ప్రకారం డ్రైవర్ అనిల్ సంగీతను హత్య చేసినట్లుగా వివరణలో తేలింది. రిలేషన్షిప్ లో వచ్చిన కొన్ని విబేధాల వలన ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంలో పోలీసులు కుటుంబ సభ్యులు గోప్యత వహించారు.

నిద్రమాత్రలు కలిపి..

నిద్రమాత్రలు కలిపి..

సంగీత మొదట కారులో ఎక్కించుకొని అనిల్ హర్యానా కలనర్ దగ్గరికి బయలుదేరారు. మార్గం మధ్యలో రవి వారిని కలిశాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి ఒక రెస్టారెంట్లో భోజనం కూడా చేశారు. ఇక అనిల్ సంగీతకు చెరుకు రసం ఇవ్వడం జరిగింది. అయితే అందులో ఒకేసారి 10 నిద్రమాత్రలు కూడా రవి కలిపేశాడు.

Recommended Video

F3 Movie Review కుంభస్థలం కొట్టిందా? గురి తప్పిందా? | Filmibeat Telugu
 గొంతు నులిమి హత్య

గొంతు నులిమి హత్య


ఇక కొద్ది దూరం వెళ్ళగానే సంగీత ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమె అలా అలా మత్తులోకి జారుకుంటున్న సమయంలో రవి ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. అనంతరం సమీపంలోని ఒక నిర్మానుష ప్రాంతంలో సంగీతను పాతి పెట్టి నిందితులు పరారయ్యారు. ఒక మూడు రోజుల తర్వాత కుటుంబ సభ్యులు లో సంగీత జాడ తెలియకపోవడంతో పోలీసులకు సంప్రదించారు. ఇక పోలీసులు అనుమానం తో రవి అనిల్ ను విచారించగా అసలు నిజం బయట పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X