ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో రిలీజ్ ఎప్పుడో తెలుసా? భారీ ధరకు రైట్స్ కొన్న లహరి!
క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈచిత్రం ఆడియో వేడుక డిసెంబర్లో ప్లాన్ చేస్తున్నారు. చిత్ర బృందం ఆడియో విడుదలకు ఇంకా డేట్ ఫిక్స్ చేయనప్పటికీ డిసెంబర్ 16న వేడుక జరిగే అవకాశం ఉందని సమాచారం.
ఎన్టీఆర్ బయోపిక్ ఆడియోరైట్స్ లహరి ఆడియో కంపెనీ దక్కించుకుంది. యూట్యూబ్ మ్యూజిక్ రైట్స్ కూడా ఇదే సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ రైట్స్ కోసం లహరి సంస్థ ఏకంగా రూ. 2 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది.
రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బాలయ్య మెయిన్ రోల్ చేస్తుండటం, ఎన్టీఆర్ జీవితంపై వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సినిమాలో పాత్రల విషయానికొస్తే... ఎన్టీ రామారావు పాత్రను బాలయ్య, ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్, శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్, చంద్రబాబు పాత్రను రానా దగ్గుబాటి, సావిత్రి పాత్రలో నిత్యా మీనన్ నటస్తున్నారు.
ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామారావు సినీ జీతాన్ని 'కథానాయకుడు'... రాజకీయ జీవితాన్ని 'మహానాయకుడు' పేరుతో విడుదల చేయబోతున్నారు. మొదటి భాగం జనవరి 9న, రెండో భాగం జనవరి 24న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











