వాయిదా పడ్డ ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ సాంగ్!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. బాలయ్య స్వయంగా తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండడంతో ఉత్కంఠ నెలకొని ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ లో బాలయ్య ఎన్టీఆర్ గెటప్ లో అదరగొడుతున్నాడు. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలోని తొలి పాటని ఇటీవల విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా నేడు రెండవ పాటని విడుదుల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
నేటి సాయంత్రం 4:21 గంటలకు రెండవ పాటని విడుదుల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ సెకండ్ సాంగ్ విడుదల వాయిదా పడ్డట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. డిసెంబర్ 12 ఉదయం 10:31 గంటలకు రెండవ పాట విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా తెలియజేశారు.

ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ గెటప్ లో ఉన్న బాలయ్య తెలుగుదేశం పార్టీ చిహ్నాలలో ఒకటైన నాగలిని చిత్రీకరిస్తూ కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో మొత్తం 9 మంది హీరోయిన్లు నటిస్తున్నారు. రానా దగ్గుబాటి సీఎం చంద్రబాబు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వ భాద్యతలు నిర్వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











