కీరవాణి అదరగొట్టాడు.. 'ఎన్టీఆర్' రెండో పాట రోమాలు నిక్కబొడుచుకునేలా!
నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడుగా రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో సినీరంగ విశేషాలు, మహానాయకుడు చిత్రంలో ఎన్టీఆర్ రాజకీయ రంగ విశేషాలని చూపించబోతున్నారు. సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం విడుదల చేయనుండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టింది.
ఇప్పటికే విడుదల చేసిన మొదటి పాటకు మంచి స్పందన వచ్చింది. తాజాగా రెండవ పాటని కూడా విడుదల చేశారు. ఋషివో అంటూ సాగే ఈ పాట అద్భుతంగా ఉంది. కీరవాణి అదిరిపోయే సంగీతం అందించారు. శివదత్త, రామకృష్ణ, కీరవాణి కలసి ఈ చిత్రానికి సాహిత్యం అందించారు. సంస్కృత శ్లోకాలని కూడా ఈ పాటలో పొందుపరిచారు. ఎన్టీఆర్ లోని నాయకత్వ లక్షణాలని కీర్తిస్తూ సాగే ఈ పాట రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది.
శరత్ సంతోష్, కీరవాణి, కాలభైరవ, శ్రీనిధి తిరుమల, మోహన భోగరాజు ఈ పాటకు గాయకులు. క్రిష్ దర్శత్వంలో రూపొందితున్న ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది. రానా, కళ్యాణ్ రామ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.



Click it and Unblock the Notifications











