జెర్సీ నుంచి మరో లిరికల్ సాంగ్.. 'ప్రపంచమే అలా'!
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం జెర్సీ. మళ్ళిరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాని ఈ చిత్రంలో క్రికెటర్ పాత్రలో నటిస్తుండడం ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రంలో నాని పాత్ర పేరు అర్జున్. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డబుల్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న నానికి గత ఏడాది కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ చిత్రాలు బ్రేక్ వేశాయి. విభిన్నమైన కథతో వస్తున్న జెర్సీ చిత్రంపై నాని ఆశలు పెట్టుకుని ఉన్నాడు.
ఏప్రిల్ 19న జెర్సీ చిత్ర విడుదలకు సన్నాహకాలు చేస్తున్నారు. దీనితో ప్రచార కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తున్నారు. ఇటీవల నాని మీడియా సమావేశం నిర్వహించిన జెర్సీ చిత్ర విశేషాలని తెలియజేశాడు. తాజాగా చిత్ర యూనిట్ ఈ చిత్రంలోని మరో పాటని విడుదల చేసింది. ఈ చిత్రానికి తమిళ సంచలనం అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు

తాజాగా విడుదుల చేసిన 'ప్రపంచమే అలా' అనే పాట వినసొంపైన సంగీతంతో హాయిగా సాగిపోయేలా ఉంది. షాషా తిరుపతి ఈ పాటకు తన అద్భుతమైన గాత్రాన్ని అందించింది. గేయ రచయిత కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. నానికి జోడిగా శ్రద్దా శ్రీనాథ్ నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మాణంలో జెర్సీ చిత్రం తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











