twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అతన్నే మెచ్చిన రామ్ చరణ్.. తండ్రి చిరంజీవి కోసం ఫిక్స్

    |

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అటు సినిమాల్లో నటిస్తూనే ఇటు నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. తన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీకి అన్నీ తానై ముందుకు తీసుకెళుతున్నారు. హీరో అంటే సెట్స్ పై బిజీగా ఉండి సినిమాలో నటించడంతో సరిపోతుంది.. కానీ ఓ నిర్మాతగా అంటే షూటింగ్ మొదలుకొని ప్రమోషన్స్ వరకూ అన్నీ దగ్గరుండి చూసుకొని సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. చెర్రీ ప్రస్తుతం తండ్రి చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సైరా నరసింహా రెడ్డి నిర్మాణ బాధ్యతలు మోస్తూ వస్తున్నారు. లొకేషన్స్, బడ్జెట్, మ్యూజిక్ కంపోజింగ్ అన్నింటా తనదైన మార్క్ ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారు.

    రాయలసీమ తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాడలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా సైరా నరసింహా రెడ్డి చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి అమిత్‌ త్రివేది స్వరాలు సమకూరుస్తున్నారు. అయితే ఇది చారిత్రాక నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కి కూడా సపరేట్‌గా ఓ మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలని భావించిన రామ్ చరణ్.. అందుకోసం జూలియస్‌ పేకియమ్‌ అనే బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని సెలెక్ట్ చేశాడు. ఈయనకు బాలీవుడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషలిస్టుగా మంచి పేరుంది.

    One More Music Director For Sy Raa Narasimhaa Reddy

    గతంలో ''ఏక్‌ థా టైగర్‌, కిక్‌, భజరంగీ భాయిజాన్‌, సుల్తాన్‌, టైగర్‌ జిందా హై, ధూమ్‌ 3, బాఘీ'' లాంటి సినిమాలకు జూలియస్‌ నేపథ్య సంగీతం అందించారు. అలాగే ఇటీవలే విడుదలైన 'భారత్‌' సినిమాలోనూ తనదైన మార్క్ చూపించారు. దీంతో జూలియస్‌ నేపథ్య సంగీతానికి బాగా ఆకర్షితుడైన రామ్ చరణ్, తన తండ్రి 'సైరా' నేపథ్య సంగీత బాధత్యలు జూలియస్‌ చేతిలో పెట్టేశారు.

    కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా నరసింహా రెడ్డి' సినిమా తెరకెక్కుతోంది. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రంలో చిత్రంలో చిరు సరసన నయనతార నటిస్తుండగా తమన్నా ముఖ్యపాత్ర పోషిస్తోంది. అమితాబ్ బచ్చన్, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కానుంది.

    English summary
    Periodical drama Sy Raa Narasimhaa Reddy is ready for release on october 2. Some romantic seens between nayanatara and chiranjeevi will be highlight in this movie. This movie will done by Ram Charan with special care.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X