RDX లవ్ అప్‌డేట్: ఇక యవ్వారం మామూలుగా ఉండదంటూ స్పెషల్ కిక్

పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా RDX లవ్. తొలి సినిమా Rx100 గ్లామర్ డాల్‌గా ముద్ర చేసుకున్న ఈ హాట్ బ్యూటీ RDX లవ్ చిత్రంలో మరింత రెచ్చిపోయి నటించింది. అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ చేపడుతున్నారు మేకర్స్. ఈ మేరకు వరుస అప్‌డేట్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేస్తున్నారు.

ఇప్పటికే 'RDX లవ్' సినిమాపై అంచనాలు రెట్టింపు చేసేలా టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు మేకర్స్. ఈ వీడియోల్లో శృంగార సన్నివేశాలను బాగా ఫోకస్ చేస్తూ యూత్ ఆడియన్స్‌లో ఆతృతను పెంచారు. శృంగారం, సేఫ్టీలు, స్వర్గం గురించి చెప్పడం కారణంగా ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు యూత్ ఆడియన్స్.

 Orabbi Lyrical Song from Paayal Rajputs RDX Love

ఈ తరుణంలో తాజాగా 'RDX లవ్' నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు. చిత్రంలోని ఓరబ్బీ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో అంతా పాయల్ హంగామానే కనిపిస్తోంది. ''హే ఆడాళ్ళ చేతికే పగ్గాలు వచ్చాక.. ఇక మామూలుగా ఉండదు యవ్వారం'' లాంటి పదాలు మహిళా ప్రేక్షకుల చూపును సైతం తిప్పేలా ఉన్నాయి. మొత్తానికి ఈ సాంగ్ కూడా సినిమాపై హైప్ పెంచేయడంలో భాగమైందని చెప్పుకోవచ్చు.

హ్యాపీ మూవీస్ పతాకంపై తెరకెక్కిన 'RDX లవ్' చిత్రానికి శంకర్ భాను దర్శకత్వం వహించగా.. సి కళ్యాణ్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. హుషారు ఫేం తేజస్ హీరోగా నటించాడు. ఈ చిత్రంలో ముమైత్ ఖాన్ ప్రత్యేక గీతంలో అభిమానులను ఎంటర్‌టైన్ చేయబోతోంది. రాధన్ సంగీతం అందిస్తుండగా, రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X