చాలా కాలం తరువాత టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న ఆరెంజ్ సంగీత దర్శకుడు!

మ్యూజిక్ డైరెక్టర్స్ సినిమాకి మరో ప్రాణం అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో అయితే ఒక పాట సక్సెస్ అయితేనే సినిమాలకు మంచి పాజిటివ్ ప్రమోషన్ గా నిలుస్తున్నాయి. అయితే మ్యూజిక్ డైరెక్టర్లుగా నిలదొక్కుకోవాలి అంటే ఈ రోజుల్లో చాలా కష్టమైన పని. మరో పాటకు కాస్త కనెక్ట్ అయినా కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయితే మ్యూజిక్ డైరెక్టర్స్ కు మరో అవకాశం దొరకడం లేదు. అందుకే సీనియర్ సంగీత దర్శకులు కూడా ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోతున్నారు. ఒకప్పుడు చెలీ, ఘర్షణ , గజిని, సూర్య s/o కృష్ణన్ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నారు. ఆ తరువాత ఆయన జయాపజయాలను లెక్క చేయకుండా అవకశాలు అందుకున్నారు. మాస్ పాటల్లో కూడా మెలోడిని జత చేయడంలో ఆయన స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

అందుకే హరీష్ జై రాజ్ మ్యూజిక్ ను ఆడియెన్స్ ఎక్కువగా లైక్ చేస్తుంటారు. అంతే కాకుండా రొమాన్స్, లవ్ సాంగ్స్ తో కూడా ఎన్నోసార్లు మ్యాజిక్ క్రియేట్ చేశారు.
తెలుగులో కూడా ఆరెంజ్ సినిమాతో ఆయన పేరు తెలుగులో కూడా మారుమ్రోగింది. ఆ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ లో ఒకటి అయినప్పటికీ హారీస్ జై రాజ్ అందించిన మ్యూజిక్ మాత్రం ఇప్పటికి ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. రామ్ చరణ్ కూడా చాలాసార్లు ఆరెంజ్ సాంగ్స్ తన ఆల్ టైమ్ ఫెవరేట్ అని చెబుతుంటారు. అయితే గత ఐదారేళ్లుగా హరీస్ జై రాజ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలుస్తున్నాయి. పాటలు కూడా అప్పట్లో మాదిరిగా ఎక్కువ రోజులు వినబడడం లేదు. ఇక తెలుగులో ఆయన చివరగా మహేష్ బాబు స్పైడర్ సినిమాకు మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. అయితే ఆ సాంగ్స్ కుడా అంతగా క్లిక్కవ్వలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తెలుగులో మళ్ళీ సినిమా ఎప్పుడు చేస్తారు అని చాలామంది ప్రేక్షకుకులు అడిగారు.

Orange music director Harris Jayaraj tollywood come back movie

ఇక మొత్తానికి హరిస్ జై రాజ్ క్లారిటీ ఇచ్చేశారు. ఇటీవల ఒక నెటిజన్ ట్విట్టర్ లో.. మళ్ళీ ఎప్పుడు తెలుగు సినిమా చేస్తారు? తెలుగు సినిమా చేసి చాలా కాలం అయ్యింది. ఇక్కడ మీకు చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారని ఆ నెటిజన్ ప్రశ్నిచగా హరీస్ జై రాజ్ వెంటనే క్లారిటీ ఇచ్చేశారు. త్వరలోనే మళ్ళీ తెలుగు సినిమా చేయబోతున్నట్లు చెబుతూ.. నితిన్ సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. నితిన్ గత ఏడాది వక్కంతం వంశీతో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంగీత దర్శకుడిగా హరీస్ జై రాజ్ సెట్టయినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో అయినా ఈ సీనియర్ సంగీత దర్శకుడు ఫామ్ లోకి వస్తాడో చూడాలి. ఇక కేవలం నితిన్ సినిమానే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హారిస్ మరికొన్ని సినిమాలకు మ్యూజిక్ అందించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X