అడల్ట్ సినిమాలో భక్తి పాట.. పాడింది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!

తెలుగు ప్రేక్షకులకు ట్రెడీషనల్ లుక్‌తో పరిచయమై 'బెజవాడ', 'నాయక్' 'ఇద్దరమ్మాయిలతో', 'జెండాపై కపిరాజు' సహా పలు సినిమాలతో సందడి చేసిన అమలాపాల్ తాజాగా నటించిన చిత్రం 'ఆమె'. తమిళంలో 'అడై' పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను ఒకేసారి తెలుగులోనూ విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాలో ఫస్ట్ లుక్, టీజర్ సంచలనం అయిన విషయం తెలిసిందే. దీనికి కారణం ఇందులో అమలాపాల్ నగ్నంగా నటించడమే.

అత్యాచార బాధితురాలి కథతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌కు భారీ స్పందన వచ్చింది. ఇది విడుదలైన కొద్దిసేపట్లోనే భారీ స్థాయిలో వ్యూస్‌ను సంపాదించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ టీజర్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. దీనిపై ''ఆమె.. అద్భుతమైన టీజర్. తప్పక చూడండి. ఇందులో అమలాపాల్ నిజాయితీతో కూడిన నగ్నత్వం నా గుండెలను తాకింది. అలాగే దర్శకుడు ఏమ్మార్ రత్న ప్రతిభ అమోఘం'' అంటూ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం స్పందించడం అప్పట్లో చర్చనీయాంశం అయింది.

 P. Susheela Sing A Song For Aadai

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమాలో ఓ భక్తి పాటను చూపించబోతున్నారు. అమలాపాల్ నగ్నంగా కనిపించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ రారనే ఉద్దేశ్యంతోనే దర్శకుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ పాట ఎవరు పాడారో తెలుసా..? తన గాత్రంలో ఎంతో మందిని మెప్పించిన ప్రముఖ నేపథ్య గాయని, గాన కోకిల పీ సుశీల. అవును ఆమె ఈ పాటను పాడారు. అయితే, ఇది తమిళంలోనే ఉంటుందా..? లేక తెలుగులోనూ ఉంటుందా అనే విషయం మాత్రం తెలియలేదు.

యువత మరి ముఖ్యంగా అమ్మాయిలు దారి తప్పితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటాయి అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి రత్న కుమార్ దర్శకత్వం వహించగా.. వీ స్టూడియోస్ నిర్మించింది. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. 'ఆడై' సినిమాకు సెన్సార్ బోర్డ్ 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. ఇందులో నగ్నత్వంతో కూడిన సన్నివేశాలు ఉండడంతో పాటు హింస ఎక్కువగా ఉన్నదన్న కారణంగానే సెన్సార్ బోర్డు 'ఏ' సర్టిఫికెట్ జారీ చేసిందని తెలిసింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఈనెల 19న విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X