RDX లవ్ లిరికల్ సాంగ్: లవ్ గారడి.. గారడి ఓ ఉప్పెన లోకి తోసిందే..
RX100 ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పంజాబీ పాప పాయల్ రాజ్‌పుత్.. ఈ సారి RDX లవ్ లవ్ రూపంలో రంగంలోకి దిగుతోంది. ముద్దు సీన్లు, శృంగార సీన్లతో సెన్సేషన్ క్రియేట్ చేయడంలో తనకు సాటి ఎవ్వరూ రారంటూ తొలి సినిమాలోనే గ్లామర్ డాల్‌గా ముద్ర వేసుకుంది పాయల్. RDX లవ్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ చేస్తూనే ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు యూనిట్ సభ్యులు. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదల చేయగా, హాట్ హాట్‌గా అది కాస్త నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా చిత్రంలోని ''లవ్ గారడి.. గారడి ఓ ఉప్పెన లోకి తోసిందే..'' అంటూ సాగిపోయే లిరికల్ సాంగ్ విడుదల చేశారు.
ఈ సాంగ్‌కి భాస్కర్ భట్ల అందించిన లిరిక్స్ మేజర్ అసెట్‌గా చెప్పుకోవచ్చు. శ్రీ కార్తిక్, ప్రియా మాలి ఆలాపన సాంగ్‌కి ప్రాణం పోశాయి. పాయల్ లుక్స్ హైలైట్ అవుతున్నాయి. యూత్ ఆడియన్స్‌ని అమితంగా ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ ప్రస్తుతం యూ ట్యూబ్‌లో వేగంగా రాబడుతోంది.

హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్న 'RDX లవ్' చిత్రానికి శంకర్ భాను దర్శకత్వం వహిస్తున్నారు. 'హుషారు' మూవీ ఫేం తేజస్, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాధన్ సంగీతం అందిస్తుండగా, రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేశారు. అతిత్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











