వీడియో: శ్రీనివాస కళ్యాణం మరో సర్‌ప్రైజ్.. పల్లెటూరి అందాలు అద్భుతంగా!
నితిన్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న శ్రీనివాస కళ్యాణం చిత్రం రేపే(ఆగష్టు 9) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వివాహ ప్రాముఖ్యతని తెలియజేసేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రతి ప్రేము ఈ చిత్రంలో కలర్ ఫుల్ గా కనిపిస్తూ పల్లెటూరి వాతావరణంలో ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా చిత్ర యూనిట్ మరో సర్ ప్రైజ్ ఇచ్చింది. ఆడియో ఆల్బంలో పొందుపరచని పల్లెటూరే పల్లెటూరే అనే వీడియో సాంగ్ ని తాజాగా విడుదల చేశారు. పల్లెటూరి అందాల నేపథ్యంలో ఈ ఈ సాంగ్ ని అద్భుతంగా చిత్రీకరించారు. సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ ఈ సాంగ్ ని వినసొంపుగా రూపొందించారు.

నితిన్, దిల్ రాజు కాంబినేషన్ లో దాదాపు 15 ఏళ్ల తరువాత రాబోతున్న చిత్రం ఇది. వివాహంలో ఆచరించకుండా మార్గుణపడిపోయిన ఎన్నో సాంప్రదాయాల్ని ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. జయసుధ, ప్రకాష్ రాజ్, నరేష్, ఆమని కీలక పాత్రల్లో నటించారు. నందిత శ్వేతా మరో హీరోయిన్ గా నటించింది.


Click it and Unblock the Notifications











