Panchathantram : విజయ్ దేవరకొండ చేతుల మీదుగా 'అరెరే అరెరే' మెలోడీ సాంగ్ విడుదల..

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలకు పెద్ద హీరోలు సపోర్ట్ చేస్తున్నారు.. తాము వచ్చిన దారి మర్చిపోకుండా చిన్న సినిమాలను ఆదరిస్తూ, వీలైతే కొన్ని సినిమాలను నిర్మిస్తూ ఇతర నటీనటులకు హీరో హీరోయిన్లకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. తాజాగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఒక చిన్న సినిమాకు తన తోడ్పాటు అందించారు. యువ హీరో రాహుల్‌ విజయ్‌, శివాత్మిక రాజశేఖర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం పంచతంత్రం.

టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ పతాకంపై అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు కలసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వారు మాత్రమే కాకుండా కళా బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, మత్తు వదలరా' ఫేమ్‌ నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీ పాద, శ్రీ విద్య, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ ‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా హర్ష పులిపాక దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా యూనిట్ సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. తాజాగా ఈ సినిమాలోని "అరెరే అరెరే మాటే..రాదే..మనసే పలికే క్షణములో"... లిరికల్ వీడియోను సెన్సేషల్ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. అరెరే అరెరే మాటే..రాదే.. మనసే పలికే క్షణములో, పిలిచి అడిగి ఆరా తీ..సి చనువే వెతికే వయసులో అంటూ సాగిపోతున్న ఈ సాంగ్ కి కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించగా ప్రశాంత్‌ ఆర్‌ విహారి, శ్రవణ్ భరద్వాజ్ లు సంగీతం అందించారు.

 Panchatanthram Movie 2nd Single arere arere Released by Vijay devarakonda

ఇక ఈ పాటని చిన్మయి, ఎస్.పి చరణ్ లు అద్బుతంగా ఆలపించారు. ఇక ఈ సందర్భంగా నిర్మాతలు సృజన్‌ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ ఇంతకు ముందు సినిమాలో వచ్చే పెళ్లి పాటలు ప్రేక్షకులను అలరించేవి, కానీ ఈ మధ్య కాలంలో ఇటువంటి పాటలు ఫీలింగ్ తగ్గిందని చెప్పుకోవాలి..."అరెరే అరెరే మాటే..రాదే.. మనసే పలికే క్షణములో".. పాట చూసిన తరువాత మళ్లీ గత జ్ఞాపకాలు ప్రేక్షకులను ఖచ్చితంగా తడతాయి అని చెప్పుకొచ్చారు.

అలాగే పెళ్ళైన వారి జీవితంలో జరిగిన పెళ్లి తంతుల్ని రీకలెక్ట్ చెసే పాటగా ఈ పాట నిలిచిపోతుందని వారు పేర్కొన్నారు. మేము ఇంతకు ముందు బ్రహ్మానందం గారి గురించి విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ఫ‌స్ట్ గ్లింప్స్‌, ఏ రాగమో లిరికర్ వీడియోకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు విజయదేవరకొండ చేతుల మీదుగా విడుదల చేసిన సాంగ్ కూడా అదే స్థాయిలో అలరిస్తుందనే నమ్మకం ఉంది అని పేర్కొన్నారు.

ఇప్పటిదాకా బ్రహ్మానందం గారు ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకులను నవ్వించారు. అలాగే ఆయనలో అద్భుతమైన నటుడు ఉన్నారని, వెయ్యి చిత్రాలకు పైగా చేసిన బ్రహ్మానందం గారు పంచతంత్రం సినిమాలో వేదవ్యాస్ గా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నందుకు మా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X