twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంగీత దిగ్గజం పండిట్ జస్రాజ్ కన్నుమూత.. బాల్యమంతా హైదరాబాద్‌లోనే.. మోదీ సంతాపం

    |

    గత ఎనిమిది దశాబ్దాలుగా భారతీయ సంగీత ప్రపంచంలో తన అద్భుత ప్రతిభతో ఆకట్టుకొన్న ప్రసిద్ద సంగీతకారుడు పండిట్ జస్రాజ్ ఇకలేరు. పద్మవిభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సోమవారం గుండెపోటుతో అమెరికాలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. ప్రఖ్యాత పండిట్ జస్రాజ్ మరణంతో సంగీత ప్రపంచం మూగబోయింది. ఆయన మరణానికి ప్రధాని మోదీ తదితరులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చూస్తూ సంతాపం ప్రకటించారు. పండిట్ జస్రాజ్ అమెరికాలోని న్యూజెర్సీలో మరణించారు అని ఆయన కుమార్తె దుర్గా జస్రాజ్ ధృవీకరించారు.

    పండిట్ జస్రాజ్ జనవరి 28, 1930లో అప్పటి బ్రిటీష్ పంజాబ్‌లోని హిస్సార్ (ప్రస్తుతం ఫతేబాద్ జిల్లా) జిల్లాలోని పిలి మండోరి గ్రామంలో జన్మించారు. ఆయన బాల్యమంతా హైదరాబాద్‌లో గడించింది. ప్రముఖ దర్శకుడు వీ శాంతారాం కుమార్తె మధుర శాంతారాంను ప్రేమించి వివాహం చేసుకొన్నారు. వారికి కుమారుడు శారంగ్ దేవ్ పండిట్, కుమార్తె దుర్గా జస్రాజ్ ఉన్నారు.

     Pandit Jasraj died due to cardiac arrest in the US at 90

    దాదాపు 80 సంవత్సరాలుగా భారతీయ సంగీత ప్రపంచంలో భాగమై సేవలందించారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా ఆయనను పద్మవిభూషణ్ (2000), పద్మ భూషణ్ (1990), పద్మశ్రీ (1975) అవార్డులతో సత్కరించారు. ఆయన సేవలకు గుర్తింపుగా అంతరిక్షంలో మార్స్, జ్యూపిటర్‌కు మధ్య ఉన్న ఓ చిన్న గ్రహానికి పండిట్ జస్రాజ్ పేరుతో నామకరణం చేశారు.

    పండిట్ జస్రాజ్ మరణంపై ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్‌ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. పండిట్ జస్రాజ్‌ మరణం దురదృష్టకరం. భారతీయ సాంస్కతిక, కళల రంగానికి తీరని లోటు. కేవలం సంగీతంతోనే కాకుండా ఎంతో మంది గాయకులకు స్పూర్తిగా, గురువుగా మారారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం అంటూ ట్వీట్ చేసి మోదీ సంతాపం ప్రకటించారు.

    English summary
    Popular and Music legend Pandit Jasraj died due to cardiac arrest in the US at 90. PM Modi and other expressed their condelences. Modi wrote in twitter that, The unfortunate demise of Pandit Jasraj Ji leaves a deep void in the Indian cultural sphere. Not only were his renditions outstanding, he also made a mark as an exceptional mentor to several other vocalists. Condolences to his family and admirers worldwide. Om Shanti.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X