రోడ్డు ప్రమాదంలో యువ గాయకుడు మృతి.. షాక్‌లో మ్యూజిక్ ఇండస్ట్రీ
వర్ధమాన గాయకుడు, పంజాబీ సింగర్ దిల్‌జాన్ ఇకలేరు. అమృత్‌సర్‌కు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దిల్‌జాన్ మృత్యువాత పడ్డారు. ఆయన వయసు 31 సంవత్సరాలు. కర్తాపూర్ నుంచి అమృత్‌సర్‌కు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొన్నది. రోడ్డు పక్కన పార్క్ చేసిన ట్రక్కును ఢీకొట్టడంతో అక్కకక్కడే ఆయన మరణించారు అని సన్నిహితులు తెలిపారు. దిల్ జాన్ మరణవార్త వినగానే ఆయన సన్నిహితులు, సంగీత ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.
ఆవాజ్ పంజాబ్ ది, సుర్ క్షేత్ర లాంటి రియాలిటీలలో దిల్ జాన్ పాల్గొన్నారు. పంజాబ్‌లో ఆయనకు మంచి గుర్తింపు, పాపులారిటీ ఉంది.ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకొంటాడుకొన్న దిల్ జాన్ అకాల మరణం తీవ్ర వేదనకు గురిచేసింది. చిన్న వయసులోనే పంజాబీ సంగీతానికి మంచి పేరు తెచ్చే ప్రయత్నం చేశారు. ఆయన లేరనే విషయాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందించారు.

దిల్ జాన్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం వారు కెనడాలో నివసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











