twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pawan Kalyan ఇచ్చే డబ్బులు తీసుకోను.. ట్విస్ట్ ఇచ్చిన కిన్నెర మొగులయ్య.. ఏం జరిగిందంటే?

    |

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రంలో టైటిల్ సాంగ్ పాడిన పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్య కారుడు దర్శనం మొగులయ్య ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. పేదరికంతో బాధపుడుతున్న ఈ కళాకారుడి గురించి తెలుసుకొన్న పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. తన చిత్రంలో ఓ కీలకమైన పాటను తన కిన్నెర వాయిద్యంతో పాడి మరింత క్రేజ్ తెచ్చిన మొగలయ్యకు పవన్ కల్యాణ్ ఆర్థిక సహాయం అందించారు. అయితే జనసేనాని ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని తీసుకోనని చిన్న షరతు విధించాడు. ఆ ట్విస్ట్ ఏమిటంటే..

    మామిడి హరికృష్ణ ఫోన్ చేసి

    మామిడి హరికృష్ణ ఫోన్ చేసి

    పాలమూరులో బతికే నాకు ప్రభుత్వ సలహాదారు కేవీ రమణ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ప్రోత్సాహం అందించారు. మామిడి హరికృష్ణ నాకు ఫోన్ చేసి సినిమాలో పాట పాడుతావా అని అడిగితే.. తప్పకుండా పాట పాడుతాను. మీ మాట తీసేయను అని చెప్పాను. నాకు పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మాట్లాడాడు. అలా నాకు అవకాశం వచ్చింది అని కిన్నెర మొగులయ్య పేర్కొన్నారు.

    నీ కిన్నెర వాయిద్యాన్ని ముట్టుకోవచ్చా?

    నీ కిన్నెర వాయిద్యాన్ని ముట్టుకోవచ్చా?

    పవన్ కల్యాణ్ ఫోన్ చేసిన తర్వాత నేను హైదరాబాద్‌కు వచ్చాను. ఆ తర్వాత నాకు హోటల్‌లో రూమ్ ఇచ్చి బాగా చూసుకొన్నారు. పవన్ కల్యాణ్ వచ్చి నాకు నమస్కారం అన్నారు. అయితే అయనే నాకు పవన్ కల్యాణ్ అనే విషయం తెలియదు. ఆయన పీఏ వచ్చి ఆయనే పవన్ కల్యాణ్ అని సైగ చేశాడు. ఆ తర్వాత నీ కిన్నెర వాయిద్యాన్ని ముట్టుకోవచ్చా అంటే.. నేను స్వయంగా నా వాయిద్యాన్ని ఆయన చేతిలో పెట్టాను అని అని కిన్నెర మొగులయ్య తెలిపారు.

    పవన్ కల్యాణ్ గురించి తెలియదు

    పవన్ కల్యాణ్ గురించి తెలియదు


    భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడక ముందు పవన్ కల్యాణ్ గురించి నాకు ఎక్కువగా తెలియదు. నాకు ఫోన్ చేసి.. నేను కలిసిన తర్వాత ఆయన ఎంత పెద్దవారో తెలుసుకొన్నాను. అంతకుముందు కేవలం సినిమా నటుడే అనుకొన్నాను. కానీ ఆ తర్వాత ఆయన మనసు, పెద్దరికం, ప్రజలకు అండగా ఉండాలనే మనస్తత్వం తెలిసింది. అందుకే ఆయనను కలువాలని అనుకొంటున్నాను అని కిన్నెర మొగులయ్య తెలిపారు.

    పవన్ కల్యాణ్‌ కలిసిన తర్వాత మరింత విలువ

    పవన్ కల్యాణ్‌ కలిసిన తర్వాత మరింత విలువ

    ఉగాది పురస్కారం సీఎం కేసీఆర్ నాకు అవార్డు ఇచ్చినప్పుడు నాకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే పవన్ కల్యాణ్‌ను కలిసిన తర్వాత నాకు మరింత విలువ వచ్చింది. ఎంతో మంది నాకు ఫోన్ చేసి ఆయన గొప్పతనం గురించి చెప్పారు. నాకు ఆయన గురించి తెలియదు. కానీ ఆయన కలిసిన తర్వాతే పవన్ కల్యాణ్ ఇచ్చిన మొత్తాన్ని నేను తీసుకొంటాను అని కిన్నెర మొగులయ్య అన్నారు.

    ఆయనను కలిసిన తర్వాతే

    ఆయనను కలిసిన తర్వాతే

    నేను పేదరికంతో బాధపడుతున్నాను. నాకు ఆడపిల్లలు ఉన్నారు. నివసించడానికి ఇల్లు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ నాకు 2 లక్షల రూపాయలు ఇవ్వడం నాకు చాలా సంతోషం. కానీ ఆయనను కలిసి మాట్లాడిన తర్వాతే ఆయన ఎంత ఇచ్చినా తీసుకొంటాను. ఆయనను కలువకుండా నేను ఒక్కపైసా కూడా తీసుకొనని మొగులయ్య స్పష్టం చేశారు.

    కిన్నెర వాయిద్యాల తయారీకి సహాయం

    కిన్నెర వాయిద్యాల తయారీకి సహాయం

    పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు అనుమతి లభిస్తే.. ఆయనతో కొన్ని మాటలు పంచుకోవాలని అనుకొంటున్నాను. నాలుగు కిన్నెర వాయిద్యాలను తయారు చేయించి ఇతరులకు ఈ కళను నేర్పించేందుకు ఆర్థిక సహాయం కోరుతాను. పవన్ కల్యాణ్ వల్ల కిన్నెర కళ బతుకుతుంది. అలాగే నాకు ఉండటానికి ఇల్లు లేదు. ఇల్లు కట్టించమని పవన్ కల్యాణ్‌ను కోరుతాను అని మొగులయ్య తెలిపారు.

    English summary
    Pawan Kalyan 2 lakhs financial assistance to Kinnera Mugulaiah after Bheemla Naik Song. But He refuesed to take aid. He said, After meeting with Pawan Kalyan only, I will accept the financial assistance.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X