Pawan Kalyan కిన్నెర మొగులయ్యకు అండగా.. భారీగా ఆర్థిక సహాయం చేస్తూ..

భీమ్లా నాయక్ చిత్రంలో టైటిల్ సాంగ్‌ పాడిన పది మెట్ల కిన్నెర వాయిద్య కారుడు దర్శనం మొగలయ్యకు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. పేదరికంతో బాధపడుతున్న ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఇటీవల తన జన్మదినం రోజున రిలీజ్ చేసిన మొగులయ్య పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణకు చెందిన పేద కళాకారుడికి పవన్ కల్యాణ్ సహాయం చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. మొగలయ్య గురించి, ఆయన పాట, పవన్ కల్యాణ్ సహాయం గురించిన వివరాల్లోకి వెళితే..

భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్..

భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్..

సెభాష్
ఆడాగాదు ఈడగాదు
అమీరోళ్ల మేడగాడు
గుర్రంనీళ్లా గుట్టాకాడ
అలుగూ వాగు తాండాలోనే
బెమ్మాజెముడు చెట్టున్నాది
బెమ్మజెముడూ చెట్టూకింద
అమ్మానెప్పులు పడతాన్నాది
ఎండాలేదు రేతిరిగాడు
ఏగూసుక్కా పుల్లిపిల్ల అంటూ మొగులయ్య పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం మీడియాతో మొగులయ్య వెల్లడించిన విషయాలు హృదయాన్ని టచ్ చేశాయి.

Recommended Video

Bheemla Nayak పాటతో కిన్నెర మొగిలయ్య స్టార్ స్టేటస్.. ఏంటీ కాంట్రవర్సీ || Filmibeat Telugu
అమ్రాబాద్ అటవీ ప్రాంతానికి చెందిన..

అమ్రాబాద్ అటవీ ప్రాంతానికి చెందిన..

కిన్నెర సంగీత వాయిద్యకారుడైన మొగులయ్య తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలోని అమ్రాబాద్‌ అటవీప్రాంతానికి చెందిన వారు. ఆయన కొన్నేళ్లుగా పదిమెట్ల కిన్నెర వాయిద్యంతో కళామతల్లికి సేవ చేస్తున్నారు. పేదరికంలో మగ్గుతున్న మొగలయ్య ప్రతిభను తెలుసుకొన్న పవన్ కల్యాణ్.. భ్లీమా నాయక్ చిత్రంలో పాట పాడే అవకాశాన్ని ఇచ్చారు.

మొగులయ్యకు పవన్ కల్యాణ్ ఆర్థిక సహాయం

మొగులయ్యకు పవన్ కల్యాణ్ ఆర్థిక సహాయం

భీమ్లా నాయక్ చిత్రంలోని పాట అత్యంత ప్రేక్షకాదరణ, సంగీత అభిమానుల మనసును దోచుకొంటున్న సమయంలో మొగులయ్యకు పవన్ కల్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. పవన్ కల్యాణ్ ఇలా కళకారులను, వాగ్గేయకారులను ప్రోత్సాహించడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా జానపద కళాకారులను తన సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం ద్వారా, లేదా వారి పాటలను తన చిత్రాల్లో పెట్టుకోవడం ద్వారా ప్రోత్సాహం అందించారు.

త్వరలోనే మొగులయ్యకు చెక్ అందజేత

త్వరలోనే మొగులయ్యకు చెక్ అందజేత

దర్శనం మొగులయ్యకు పవన్ కల్యాణ్ లర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అనే ఫౌండేషన్ నుంచి ఆర్థిక సహాయం అందించారు. తన కార్యాలయ సిబ్బందికి పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే మొగులయ్యకు చెక్ అందించాలని తన సిబ్బందిని ఆదేశించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X