నిత్యా మీనన్ తో భీమ్లా నాయక్ మరొక యాంగిల్.. పోస్టర్ తో మరో సర్‌ప్రైజ్‌.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి మొదటి సారి కలిసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మలయాళంలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో నిత్యా మీనన్ పవన్ కళ్యాణ్ కు జోడీగా నటిస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన టీజర్స్ సాంగ్స్ తో మరింత హైప్ క్రియేట్ చేసిన భీమా నాయక్ మరొక యాంగిల్ చూపించడానికి సిద్ధమవుతున్నాడు. చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

భీమ్లా నాయక్ అంతకుమించి అనేలా..

భీమ్లా నాయక్ అంతకుమించి అనేలా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది వకీల్ సాబ్ సినిమాతో మొత్తానికి బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ తో మరోసారి తన మార్కెట్ బలాన్ని చూపించాడు. ఇక ఆ సినిమా తర్వాత రాబోతున్న భీమ్లా నాయక్ సినిమా అంతకుమించి ఓపెనింగ్స్ అందుకుంటుందని ప్రస్తుతం పెరుగుతున్న హైప్ చూస్తేనే అర్థమవుతుంది. సినిమా లో డానియల్ శేఖర్ పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్న విషయం తెలిసిందే.

హై వోల్టేజ్ కాంబినేషన్

హై వోల్టేజ్ కాంబినేషన్

భీమ్లా నాయక్ సినిమాపై రోజురోజుకు ఆసక్తి పెరిగేలా చిత్ర యూనిట్ ప్రమోషన్ ను కూడా గట్టిగానే చేస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రానా దగ్గుపాటి పాత్రలకు సంబంధించిన పవర్ ఫుల్ టీజర్స్ విడుదల చేశారు. చూస్తుంటే ఇద్దరూ పోటాపోటీగా సినిమాలో హై వోల్టేజ్ వాతావరణాన్ని క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది తప్పకుండా ఈ సినిమా ఊహలకు అందని విధంగానే ఉంటుందని ఒక క్లారిటీ వచ్చేసింది.

15వ తేదీన మరో సాంగ్

15వ తేదీన మరో సాంగ్

ఇక ఈ సినిమాలో నిత్యా మీనన్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. మొదట సాయి పల్లవి ని సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నారు. కానీ ఆమె రీమేక్ సినిమాలు చేయనని చెప్పడంతో నిత్యామీనన్ ని ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక కూల్ పోస్టర్ ను కూడా ఇటీవల విడుదల చేశారు. పవన్ నిత్యామీనన్ కలయికలో 'అంత ఇష్టం' అనే ఒక పాటను ఇటీవల షూట్ చేశారు. ఇక ఈ నెల 15వ తేదీన ఆ పాటను విడుదల చేయబోతున్నారు.

టైటిల్ సాంగ్ తోనే భారీగా క్రేజ్

టైటిల్ సాంగ్ తోనే భారీగా క్రేజ్

ఇప్పటికే భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంది ఇక ఇప్పుడు మరొక రొమాంటిక్ సాంగ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించిన విషయం తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాస్తున్నారు.

Recommended Video

Vaishnav Tej,Rakul Preet Singh Interview About Kondapolam Movie
విడుదల ఎప్పుడంటే..

విడుదల ఎప్పుడంటే..

సినిమా విడుదల తేది పై గత కొన్ని రోజులుగా అనేక రకాల కథనాలు అయితే కన్ఫ్యూజన్ కి గురిచేస్తున్నాయి. ఎందుకంటే RRR సినిమా జనవరి 7వ తేదీన వస్తుండడంతో భీమ్లా నాయక్ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని రీసెంట్ గా నిత్యా మీనన్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పోస్టర్ లో సినిమా జనవరి 12 వ తేదీన రాబోతున్నట్లు మరొక సారి క్లారిటీ ఎకరు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X