పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ రెడీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భీమ్లా నాయక్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళం బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన అయ్యప్పన్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ తో మొదటి సారి రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. భీమ్లా నాయక్ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ అందిస్తుండగా సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇక చాలా రోజుకు అనంతరం సినిమాకు సంబంధించిన కీలకమైన అప్డేట్ కూడా ఇచ్చేశారు. ఇదివరకే భీమ్లా నాయక్ ఫస్ట్ లుక్ టీజర్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ పాత్రను ఏ స్థాయిలో చూపించబోతున్నారో ఈజీగా అర్థమైంది. ఇక ఈ సినిమా టైటిల్ సాంగ్ పై కూడా త్వరలోనే రాబోతున్నట్లు గత కొన్ని రోజులుగా ఒక టాక్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ విషయంలో కూడా చిత్రయూనిట్ అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వనుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న టైటిల్ సాంగ్ విడుదల చేయబోతున్నారు. ఉదయం 11గంటకు 16నిమిషాలకు అంటూ ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు.

Pawan kalyan Bheemla Nayak Title Song on 2nd September

టేబుల్ పై గన్ను పెట్టిన పవన్ కళ్యాణ్ మొదటి పాటతోనే సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేలా ఉన్నట్లు ఒక క్లారిటీ ఇచ్చేశారు. భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అలాగే రానా దగ్గుబాటి పాత్ర కూడా అదే తరహాలో ఉంటుందని చిత్ర యూనిట్ అయితే ఇది వరకే కొన్నిసార్లు క్లారిటీ ఇచ్చేసింది. వీలైనంత త్వరగా రానా దగ్గుబాటి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఆ టీజర్ విడుదల అయితే ఈ సినిమాపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.

ఇక మొదట ఈ సినిమాను అక్టోబర్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా పరిస్థితుల వలన మళ్లీ వాయిదా వేయక తప్పలేదు. జనవరిలోనే ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేయాలని రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చేశారు. పోటీగా ఎంత మంది ఉన్నా కూడా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన సినిమాను బాక్సాఫీస్ భరిలోకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను వాయిదా వేసుకొమ్మని కొంత మంది స్టార్ హీరోలు కూడా నిర్మాతలకు సలహాలు ఇచ్చారట.

కానీ చిత్ర యూనిట్ మాత్రం అస్సలు వెనక్కి తగ్గే ఛాన్స్ లేదని ఓపెన్ గానే వివరణ ఇచ్చారట. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు అందించడమే కాకుండా డైరెక్షన్ భాగంలో కూడా తన వంతు సహాయం చేస్తున్నట్లు టాక్ వస్తోంది. తప్పకుండా సినిమా భారీ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం అని అర్థమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X