పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆటగదరా శివ మూవీ సాంగ్ లాంచ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిజీ పొలిటికల్ షెడ్యూల్ తరువాత ఇటీవల కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం పవన్ తిరిగి పొలిటికల్ కార్యక్రమాలతో బిజీకాబోతున్నాడు. ట్రైలర్ తోనే ఆటగదరా శివ చిత్రంపై ఆసక్తి పెరిగింది.
ఈ చిత్రంలోని ఓ సాంగ్ ని విక్రాంతి వెంకటేష్ చేతుల మీదుగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. నేడు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మరో సాంగ్ లాంచ్ కాబోతోంది. ఎట్టాగయ్యా శివ అనే సాంగ్ ని చిత్ర యూనిట్ పవర్ స్టార్ తో లాంచ్ చేయించనున్నారు. నేటి(శనివారం) సాయంత్రం 6 గంటలకు పవన్ ఈ సాంగ్ లిరికల్ వీడియో లాంచ్ చేస్తారు.

విభిన్న చిత్రాల దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ ఈ చిత్రానికి దర్శకుడు. రాక్ లైన్ ఎంటర్టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హైపర్ ఆది ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











