Pawan Kalyan: పవన్ కల్యాణ్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్.. 1 గంటలోనే పవర్ స్టార్ ఆల్ టైం రికార్డు!
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఓవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పాలన బాధ్యతలు చేపడుతూనే .. మరోవైపు తాను గతంలో ఒప్పుకున్న సినిమాల్లో నటిస్తున్నారు. అలా గతంలో ఒప్పుకున్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమాగా హరిహర వీరమల్లు తెరకెక్కడంతో ఈ మూవీపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. ఈ తరుణంలో ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది.అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించే..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు. పిరియడికల్ బ్యాక్‌డ్రాప్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీకి దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ చిత్రం మొదటి పార్ట్ హరిహర వీరమల్లు పార్ట్: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో ప్రేక్షకుల రాబోతున్నది. ఇప్పటికే మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ వెల్లడిస్తూ సరికొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్ కు ఎనలేని ఆదరణ వస్తోంది. ఈ పోస్టర్ లో పవన్ కల్యాణ్ మాస్ లూక్ లో కత్తిని గాల్లోకి దూస్తూ కనిపిస్తారు. ఈ కొత్త పోస్టర్ లో క్రిష్ జాగర్లమూడితోపాటు జ్యోతి కృష్ణ పేరు కూడా కనిపిస్తోంది. వాస్తవానికి ఈ మూవీకి మొదట క్రిష్ దర్శకత్వం వహించారు. కానీ, పవన్ డేట్స్ దొరకపోవడం, రాజకీయాలపై పవర్ స్టార్ పోకస్ చేయడంతో సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది. దీంతో క్రిష్ ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. దీంతో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ మిగిత సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు.
ఈ పిరియడికల్ బ్యాక్ డ్రాప్ మూవీలో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే.. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్, నాజర్, కమెడియన్ సునీల్, అభిమన్యు సింగ్, అయ్యప్ప పి శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి గారు మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. గతంతో టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై ఎన్నాడు చూడని యాక్షన్ మూవెంట్స్, ఫైట్ సీన్స్ తెరకెక్కించేందుకు దర్శకుడు జ్యోతి కృష్ణ ప్రయత్నాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే..ఈ సినిమాను ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక బిట్ సాంగ్ తన గొంతుతో పాడారంట. ఈ పాటను పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు రికార్డు చేసినట్టు తెలుస్తోంది. ఎవరూ ఊహించని విధంగా హరిహర వీరమల్లు షూటింగ్ సెట్లో కేవలం ఒక గంట సమయంలోనే ఈ పాట పూర్తి స్థాయిలో రికార్డింగ్ చేశారంట. ఒక గంటలో ఒక పాటను రికార్డు చేయడం ఇప్పటివరకు సిని చరిత్రలో జరగలేదు. ఎంత పెద్ద సింగర్ అయినా.. ఒక పాట కోసం కనీసం ఒక రోజు సమయం తీసుకుంటారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం గంటలోనే పాట పూర్తి చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు.
ఈ పాట రెండు మూడు నిమిషాల వ్యవధి ఉంటుందనీ, ఈ పాటకు ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందించినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో ఈనెల 23వ తేదీ నుండి పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. రోజుకు నాలుగు గంటల పాటు సినిమా షూటింగ్ పాల్గొనబోతున్నారట. ఇకపోతే హరి హర వీర మల్లు మూవీ ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ , తమిళ్ , మలయాళం, కన్నడ భాషలో విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











