India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bheemla Nayak సంచలనం: 29 రోజులుగా నెంబర్ వన్.. టాలీవుడ్‌లో ఆల్‌టైం రికార్డు

  |

  సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ బడా హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కమ్‌బ్యాక్ మూవీ 'వకీల్ సాబ్' ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్‌ను అందుకోవడంతో పాటు భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంది. దీంతో ఆయన రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఇక, ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తోన్న సినిమాల్లో 'భీమ్లా నాయక్' ఒకటి. భారీ మల్టీస్టారర్‌గా వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో అంచనాలున్న ఈ సినిమా తాజాగా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. తద్వారా తెలుగులోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  భారీ మల్టీస్టారర్‌గా భీమ్లా నాయక్

  భారీ మల్టీస్టారర్‌గా భీమ్లా నాయక్

  టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలయికలో తెరకెక్కుతోన్న భారీ మల్టీస్టారర్ మూవీనే ‘భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

  మళ్లీ రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్: మేకప్ రూమ్‌లో ముందూ వెనకా చూపిస్తూ ఘోరంగా!

  ఆ మూవీ రీమేక్.. హీరో పాత్రలివే

  ఆ మూవీ రీమేక్.. హీరో పాత్రలివే

  మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియం'కు భీమ్లా నాయక్ మూవీ రీమేక్‌గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇగో ఉన్న ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ డాన్ మధ్య జరిగే పోరుతో ఇది రూపొందింది. ఇందులో పోలీస్ పాత్రలో పవన్.. లోకల్ డాన్‌గా దగ్గుబాటి రానా కనిపించనున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరి పాత్రలకు సంబంధించిన వీడియోలనూ వదిలారు.

  రిలీజ్ వాయిదా.. ఆ రెండు డేట్లు

  రిలీజ్ వాయిదా.. ఆ రెండు డేట్లు

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘భీమ్లా నాయక్' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని భావించారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరి 25కు వాయిదా పడింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించడంతో అయోమయం నెలకొంది.

  బీచ్‌లో ప్యాంట్ లేకుండా బిగ్ బాస్ దివి రచ్చ: వామ్మో ఈ తెలుగు పిల్లను ఇలా చూశారంటే!

  వాటితో అంచనాలు రెట్టింపుగా

  వాటితో అంచనాలు రెట్టింపుగా

  భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘భీమ్లా నాయక్' ఫస్ట్ గ్లిమ్స్ ఆ మధ్య వచ్చింది. ఆ తర్వాత దగ్గుబాటి రానా గ్లిమ్స్ వీడియో కూడా రిలీజ్ అయింది. ఇవి అభిమానులతో పాటు సినీ ప్రియుల ఆదరణను అందుకున్నాయి. అలాగే, ఆ తర్వాత వచ్చిన పాటలకు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో రిలీజ్‌కు ముందే ఇది ఎన్నో రికార్డులను నమోదు చేసింది.

  టైటిల్ సాంగ్‌కు భారీ రెస్పాన్స్

  టైటిల్ సాంగ్‌కు భారీ రెస్పాన్స్


  పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ‘భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్‌ విడుదలైంది. థమన్ కంపోజ్ చేసిన ఈ పాట ను రామజోగయ్య శాస్త్రి రచించగా.. శ్రీకృష్ణ పృథ్వీ చంద్ర, రామ్ మిరియాలతో కలిసి థమన్ స్వయంగా ఆలపించాడు. ఆరంభంలో దర్శనం మొగలయ్య బుర్రకథ చెప్పారు. ఇక, ఈ టైటిల్ పాటకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

  యంగ్ క్రికెటర్‌తో బాలయ్య హీరోయిన్ నైట్ పార్టీ: ఇద్దరూ అలా దొరికిపోవడంతో కలకలం!

  RRR, Bheemla Nayak Release Dates బాక్సాఫీస్ వార్ | Radhe Shyam | KGF 2 | Filmibeat Telugu
  టాలీవుడ్‌లో ఆల్‌టైం రికార్డుతో

  టాలీవుడ్‌లో ఆల్‌టైం రికార్డుతో

  ‘భీమ్లా నాయక్' మూవీ టైటిల్ సాంగ్‌ తాజాగా మరో అరుదైన రికార్డుతో ఆల్‌టైం రికార్డును అందుకుంది. ఈ పాటు యూట్యూబ్ మ్యూజిక్ సెక్షన్‌లో ఏకంగా 29 రోజుల పాటు నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ అయింది. దీంతో టాలీవుడ్‌లో ఈ ఫీట్‌ను అందుకున్న ఏకైక సినిమాగా ఇది నిలిచింది. తద్వారా పవన్ కల్యాణ్ ఖాతాలో మరో ఘనత వచ్చి చేరినట్లు అయింది.

  English summary
  Pawan Kalyan, Rana Daggubati Doing Bheemla Nayak Movie Under Saagar K Chandra Direction. Now This Movie Title Song Creates All Time Record
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X