దూసుకుపోతోన్న ‘వకీల్ సాబ్’ సాంగ్: 24 గంటలకు కూడా కాకముందే అన్నీ వ్యూస్

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన చిత్రం 'వకీల్ సాబ్'. టాలెంటెడ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ రూపొందించిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ పరంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ మంచి కలెక్షన్లను అందుకుంది. అయితే, లాంగ్‌ రన్‌లో కరోనా ప్రభావం పెరగడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఈ మూవీ టికెట్ రేట్లు భారీగా తగ్గించడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోలేకపోయింది. ఫలితంగా ఈ చిత్రం కమర్షియల్‌గా సక్సెస్‌ను దక్కించుకోవడంలో విఫలం అయిందనే చెప్పాలి.

మొదటి ఆట నుంచే 'వకీల్ సాబ్' సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఇందులో పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్యలు చేసిన నటనకు మంచి మార్కులే పడ్డాయి. వీళ్ల తర్వాత అంత పేరు వచ్చింది మాత్రం మ్యూజిక్ డైరెక్టర్‌ థమన్‌కే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో బ్యాగ్రౌండ్ స్కోర్ ఇరగదీసేసిన అతడు.. 'మగువా మగువా' సాంగ్‌కు ప్రాణం పెట్టి మరీ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. రిలీజ్‌కు ముందే అన్ని పాటలూ విడుదల అయినప్పటికీ.. 'మగువా మగువా' ఫీమేల్ వెర్షన్ మాత్రం సినిమాలో అందరినీ సర్‌ప్రైజ్‌కు గురి చేసింది.

Pawan Kalyans Vakeel Saab Maguva Maguva Female Song Huge Response

రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటను మోహన భోగరాజు ఆలపించారు. తాజాగా 'మగువా మగువా' ఫీమేల్ వెర్షన్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దీనికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫలితంగా 24 గంటలకు గడవక ముందే దీనికి 1.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే, దాదాపు లక్ష వరకూ లైకులు దక్కాయి. దీంతో ఈ పాట ట్రెండ్ అవుతోంది. ఇక, ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటించగా.. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X