Bro: మనల్ని ఆపేది ఎవడు 'బ్రో'.. మామ అల్లుళ్ల స్టెప్పులు అదుర్స్.. ఫస్ట్ సాంగ్ రిలీజ్

మామ అల్లుళ్లు పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న చిత్రం బ్రో (Bro Movie). వినోదయ సీతమ్ రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమాకు నటుడు, డైరెక్టర్ సముద్ర ఖని దర్శకత్వం వహించారు. తెలుగులో వస్తున్న బ్రో మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. ఎప్పటికప్పుడు అదిరిపోయే అప్డేట్స్ ఇస్తూ ఊరిస్తున్నారు. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. దాని నుంచి రిలీఫ్ పొందేందుకు తాజాగా బ్రో మూవీ ఫస్ట్ సింగిల్ సాంగ్ వదిలారు.

జీ స్టూడియోస్ సమర్పణలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న తాజా చిత్రం బ్రో. దీనికి మరో సహా నిర్మాతగా వివేక్ కూచిబోట్ల వ్యవహరించారు. పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ తొలి కాంబినేషన్ మూవీని సముద్ర ఖని డైరెక్ట్ చేయగా.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. ఇక ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. దీంతో ఎప్పుడో ప్రమోషన్స్ మొదలు పెట్టగా.. క్యారెక్టర్ పోస్టర్స్, ప్రోమోలు, గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Pawan Kalyan Sai Dharam Tej Bro First Lyrical Single Released

తాజాగా బ్రో సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. ఇదివరకు చెప్పినట్లుగానే మై డియర్ మార్కండేయ అనే పాటను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఎస్ తమన్ సంగీతం మ్యూజిక్ అందించగా.. సింగర్ రేవంత్, స్నిగ్ధ శర్మ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు గణేష్ స్వామి, భాను కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్ మూవీ కోసం నిర్మించిన విలాసవంతమైన పబ్ సెట్ లో షూట్ చేశారు. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా సాంగ్ ఉంది.

ఇంట్రో ఆపు.. దుమ్ము లేపు అంటూ స్టార్ట్ అయిన ఈ పాటలో స్టైలిష్ అవతార్ లుక్ లో సాయి ధరమ్ తేజ్ కనిపించాడు. అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకోవడంతో పాటు 'మై డియర్ మార్కండేయ.. కమ్ ఆన్ కమ్ ఆన్ డ్యాన్స్ బ్రో.. యమ్మా యమ్మ బీట్స్ బ్రో.. జిందగీనే జూక్ బాక్స్ బ్రో..' వంటి పదాలు ట్రెండీగా హమ్ చేసేలా ఉన్నాయి. అలాగే పవన్ కల్యాణ్ తన లుక్ తో ఆకట్టుకున్నాడు.

'మై డియర్ మార్కండేయా.. మంచి మాట చెప్తా రాసుకో.. మళ్లీ పుట్టి భూమికి రానే రావు నిజం తెలుసుకో.. పక్క దిగి నిద్ర లేచే ప్రతిరోజు పండుగ చేసుకో' అని పవన్ క్యారెక్టర్ కు తగినట్లుగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ పాటలో బాలీవుడ్ హాట్ బ్యూటి ఊర్వశీ రౌటేలా దర్శనం ఇచ్చింది. సాయి ధరమ్ తో కలిసి ఊర్వశీ స్టెప్పులు వేసింది. మధ్యలో మనల్నీ ఆపే మగాడు ఎవడు బ్రో అనే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X