Don't Miss!
- Finance
Market Crash: మార్కెట్లలో రక్తపాతం.. తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. రూ.12 లక్షల కోట్లు మిస్..
- News
నందమూరి తారకరత్న ఆరోగ్యం పై బాలకృష్ణ క్లారిటీ - ఎమోషనల్..!!
- Sports
Australia Open 2023: ఫైనల్‌లో ఓటమి.. ఏడ్చిన సానియా మీర్జా వీడియో
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
- Lifestyle
Trans fat foods: ఈ విషాహారాలు తినడం వల్ల 5 బిలియన్ల మందికి గుండె జబ్బులు వస్తున్నాయి..జాగ్రత్త!
- Technology
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
పవన్ కల్యాణ్ పాటకు జెన్నీఫర్ లోపేజ్ అబ్బ... మొన్న ఖైదీ నంబర్ 150, నేడు.. అంటూ షాక్‌లో దేవీ శ్రీ
Recommended Video
అంతర్జాతీయ వేదికలపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మ్యూజిక్ సెన్సేషన్ దేవీ శ్రీ ప్రసాద్ పేరు మార్మోగింది. వరల్డ్ ఆఫ్ డ్యాన్స్ రియాలిటి షో వేదికపై సర్దార్ గబ్బర్ సింగ్ పాట మోత మోగించింది. ప్రపంచ హాలీవుడ్ దిగ్జజాలు జెన్నిఫర్ లోపేజ్, నో యో, డెరిక్ హాఫ్ లాంటి వారిని చప్పట్లు కొట్టించేలా చేసింది. ఈ కార్యక్రమంలో ది కింగ్స్ బృందం చేసిన డ్యాన్స్ ప్రతీ ఒక్కరిని మంత్ర ముగ్గుల్ని చేసింది. తన పాటకు అంతర్జాతీయ గుర్తింపు లభించడంపై దేవీ శ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు. పవన్ పాట సృష్టించిన అలజడి ఏమిటంటే..

రసవత్తరంగా డ్యాన్స్ కాంపిటీషన్
ఎన్‌బీసీ నిర్వహించే డ్యాన్స్ రియాలిటీ షో వరల్డ్ ఆఫ్ డ్యాన్స్ ఫైనల్‌లో రసవత్తర పోటీ జరిగింది. ఫైనల్‌లో నువ్వా నేనా అనే విధంగా జరగడంతో ది కింగ్స్ జట్టు సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలోని ‘వాడెవడన్నా.. వీడెవడన్నా' పాటను ఎంపిక చేసుకొన్నారు. ఆ పాటకు ముంబైకు చెందిన ది కింగ్స్ బృందం డిజైన్ చేసిన కొరియోగ్రఫి, డ్యాన్సర్ల ఫెర్ఫార్మెన్స్ ఇరుగదీశాయి. చివర్లో బాహుబలి మ్యూజిక్‌ను కూడా వినిపించారు.
|
జెన్నీఫర్ లోపేజ్‌తో సహా
ఆవేశంగా, హై ఎనర్జీతో సాగే సర్దార్ గబ్బర్ సింగ్ పాటకు జెన్నీఫర్ లోపేజ్ ఇతరులు ఫిదా అయ్యారు. జెన్నీఫర్ లోపేజ్‌తోపాటు న్యాయమూర్తులందరూ తమ సీట్లలో నుంచి లేచి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పాటను హై ఓల్టేజ్ ఫెర్ఫార్మెన్స్‌తో మరో లెవెల్‌కు తీసుకెళ్లిన ది కింగ్స్ బృందం ఎన్‌బీసీ వరల్డ్ ఆఫ్ డ్యాన్స్ 2019లో టైటిల్ ఎగురేసుకొని వెళ్లి ఛాంపియన్‌గా నిలిచింది.

షాక్ గురైన దేవీ శ్రీ ప్రసాద్
ది కింగ్స్ బృందానికి టైటిల్ ఇచ్చిన ఆడెవడన్నా.. వీడెవడన్నా అనే పాటను సర్దార్ గబ్బర్ సింగ్ కోసం దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడు. రామజోగయ్య శాస్త్రి గేయాన్ని రచించారు. తన పాటను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడం, చాంఫియన్‌షిప్ గెలుచుకోవడం దేవీని షాక్ గురిచేసింది. తన భావోద్వేగాన్ని సోషల్ మీడియాలో పంచుకొన్నారు.
|
ఓ మైగాడ్ అంటూ దేవీ శ్రీ ప్రసాద్ ట్వీట్
ది కింగ్స్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి థ్రిల్ అయ్యాను. మీరు చేసిన తీరు ఆకట్టుకొన్నది. స్టేజ్ మీ ప్రదర్శన విపరీతంగా ఆకట్టుకొన్నది. మీరు సత్తాను అలాగే కొనసాగించండి అని దేవీ శ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు. ఓ మైగాడ్.. మీ ఫెర్ఫార్మెన్స్ బ్రిల్లియంట్ అని కామెంట్ చేశాడు.

మొన్న ఖైదీ నంబర్ 150 నేడు.. సర్దార్ గబ్బర్ సింగ్
అంతేకాకుండా ఆ మధ్య ఖైదీ నంబర్ 150లోని సుందరీ పాట.. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలోని వాడెవడన్నా పాటకు అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు రావడం ఆనందంగా ఉంది అని దేవీ శ్రీ ప్రసాద్ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నారు.