మరోసారి పాట పాడుతున్న పవన్.. ఎవరు ప్లాన్ చేశారో తెలుసా?
వరుస సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే రాజకీయాల కోసం గ్యాప్ ఇచ్చి.. ఆ విరామాన్ని ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టులతో భర్తీ చేయడానికి పాటు పడుతున్నాడు టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇందులో భాగంగానే ఇటీవలి కాలంలోనే కొన్ని సినిమాలను కూడా ప్రేక్షకులకు అందించాడు. ఇక, ఇప్పుడు ఫుల్ ప్రాజెక్టులతో యమ బిజీగా గడుపుతోన్నాడు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తోన్న సినిమాల్లో 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఒకటి. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. యాక్షన్ జోనర్‌లో 1990 నాటి బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న ఈ చిత్రంపై ఆరంభంలోనే హైప్ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'OG' మూవీకి సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల వ్యవధిలోనే యాభై శాతం వరకూ పూర్తైంది. దీంతో ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ వరుసగా అప్‌డేట్లు ఇస్తూనే ఉంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా నుంచి గ్లింప్స్ వీడియో వచ్చింది. దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ కూడా సొంతం అయింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సుజిత్ కాంబోలో రాబోతున్న 'OG' మూవీకి సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ చిత్రం పవన్ కల్యాణ్ ఓ పాటను పాడబోతున్నాడట. ఈ విషయాన్ని చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ తాజాగా వెల్లడించాడు.
తాజాగా ఓ షోలో పాల్గొన్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ''OG' మూవీలో పవన్ కల్యాణ్‌తో పాట పాడించే అవకాశాలు చాలా ఉన్నాయి. దానిపై మేము వర్క్ చేస్తున్నాం. ఒకవేళ అంతా ఓకే అయితే ఆయనతో ఓ సాంగ్ కంపోజ్ చేయాలని ఆసక్తిగా ఉన్నాను' అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే కనుక నిజం అయితే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పండుగ చేసుకోవడం ఖాయం అని చెప్పాలి.

ఇదిలా ఉండగా.. 'OG' చిత్రాన్ని RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో చేస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతం ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











