పవర్ స్టార్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్.. మరోసారి గాయకుడిగా పవన్ కళ్యాణ్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో చాలా బిజీగా మారిపోయాడు. గతంలో ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత మాత్రం అతి తక్కువ సమయంలోనే ఒకేసారి నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు. వకీల్ సాబ్ సినిమా అనంతరం ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు షూటింగ్ కూడా అదే స్పీడ్ లో ఫినిష్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ త్వరలో మరోసారి గాయకుడిగా కూడా అలరించబోతున్నట్లు తెలుస్తోంది.

చిన్న లైన్స్ కూడా

చిన్న లైన్స్ కూడా

దాదాపు ప్రతి సినిమాలోనూ పవన్ కళ్యాణ్ ఏదో ఒక సన్నివేశంలో పాటలు పాడుతూ చాలా సరదాగా కనిపిస్తూ ఉంటాడు. కొన్ని సినిమాల్లో క్యాజువల్ గా పాడిన చిన్న లైన్స్ కూడా మంచి క్రేజ్ ను అందుకున్నాయి. ఇక అత్తారింటికి దారేది సినిమాలో కాటమరాయుడు పాట ఏ స్థాయిలో బజ్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

రాజకీయాల కారణంగా

రాజకీయాల కారణంగా

ఇక అజ్ఞాతవాసి సినిమా లో మరొక పాటను పాడిన విషయం తెలిసిందే. కొడకా కోటేశ్వర రావు అని పవన్ కళ్యాణ్ పాడిన ఫాస్ట్ బీట్ సాంగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా సినిమాలకు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఎలాగైనా ఓ మంచి సినిమాతో మళ్ళీ ప్రేక్షకులను అలరించాలి అని బాలీవుడ్ పింక్ సినిమాను వకీల్ సాబ్ గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే.

పవన్ నుంచి మరో పాట

పవన్ నుంచి మరో పాట

ఇక మరోసారి పవన్ కల్యాణ్ తన గాత్రాన్ని వినిపించిబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేకమైన పాటను ఆలపించనున్నట్లు సమాచారం. చిన్న బిట్ లో వచ్చే ఆ సాంగ్ అభిమానులను తప్పకుండా ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. థమన్ ప్రత్యేకంగా కంపోజ్ చేసిన ఆ పాటను పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో పాడనున్నారట. మరి ఆ పాట సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

పాన్ ఇండియా ప్రాజెక్టుగా

పాన్ ఇండియా ప్రాజెక్టుగా

భీమ్లా నాయక్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కబోతున్న ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక రాబిన్ హుడ్ పాత్రలో నటించబోతున్నారని సమాచారం.

భవదియుడు భగత్ సింగ్

భవదియుడు భగత్ సింగ్

అంతేకాకుండా హరీష్ దర్శకత్వంలో భవదియుడు భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ లో పవన్ కళ్యాణ్ రెండు విభిన్నమైన పాత్రలో దర్శనం ఇవ్వబోతున్నాడు. మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి సందేశం కూడా ఇవ్వబోతున్నట్లు దర్శకుడు హరీష్ శంకర్ ముందే క్లారిటీ ఇచ్చేశాడు.

మరో యాక్షన్ మూవీ

మరో యాక్షన్ మూవీ

అంతేకాకుండా సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమా ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో తెరపైకి రాబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ స్థాయికి తగ్గట్లుగా హీరోయిజాన్ని కూడా దర్శకుడు సురేందర్ రెడ్డి తనదైన శైలిలో ప్రజెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ దర్శకుడు అఖిల్ తో ఏజెంట్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X