twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆలస్యమైనా అదిరిపోయింది.. కంటిపాప అంటూ వకీల్ సాబ్ రొమాన్స్

    |

    తమన్ సంగీతం అందిస్తున్నాడంటే ఈ మధ్య అంచనాలు ఎలా ఉంటున్నాయో అందరికీ తెలిసిందే. అలాంటి తమన్ తనకు ఇష్టమైన స్టార్స్‌కు ఇంకెలా ఇస్తాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌తో తమన్ ట్రెండ్ అవుతున్నాడు. వదిలిన ప్రతీ పాట కూడా దుమ్ములేపుతోంది. గతేడాది వదిలిన మగువా మగువా అనే పాట ఇప్పటికీ హల్చల్ చేస్తూనే ఉంది.

    ఇక ఈ మధ్యే వదిలిన సత్యమేవ జయతే పాట ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. ఇక ఎంతగా వైరల్ అయిందో అంతే స్థాయిలో ట్రోలింగ్ కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గొప్పదనాన్ని చెబుతూ రాసినట్టుగా ఉందని లిరిసిస్ట్ మీద ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే అదంతా పక్కన పెట్టేస్తే ఆ పాట మాత్రం దుమ్ములేచిపోయింది. ఇప్పుడు వకీల్ సాబ్ కాస్త రొమాంటిక్ మూడ్‌లోకి వచ్చేశాడు.

    Pawan kalyan Vakeel saab kantipaapa out

    కంటిపాప అంటూ హీరోయిన్ శ్రుతీ హాసన్‌తో ఆడి పాడుతున్నాడు. ఐదు గంటలకు పాట విడుదల చేస్తామని చెప్పి చివరి క్షణంలో సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైందని ప్రకటించారు. ఓ 20 నిమిషాలు ఆలస్యంగా పాటను వదిలారు. అయితే ఆ వెయింటింగ్‌కు తగ్గట్టే పాట కూడా అదిరిపోయింది. కంటిపాప అంటూ అర్మాన్ మాలిక్ గొంతులో అద్భుతంగా ఉంది. రామజోగయ్య సాహిత్యం,తమన్ బాణీ పాటను వినసొంపుగా మార్చేసింది. ప్రస్తుతం ఈ పాట నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఏప్రిల్ 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    English summary
    Pawan kalyan Vakeel saab kantipaapa out..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X