Waltair Veerayya: బాస్ పార్టీకి పవర్ స్టార్ ఫిదా.. చిరంజీవితో పవన్ కళ్యాణ్ ఫొటోస్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ డోస్ కూడా పెంచారు. ఇప్పటికే విడుదల చేసిన కొన్ని పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఇక ఇప్పుడు మొదటి సాంగ్ ను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలోని మొదటి సాంగ్ బాస్ పార్టీ ప్రోమో ను కూడా ఉదయం విడుదల చేయగా మంచి క్రేజ్ అందుకుంది.

ఇక బుధవారం రోజు సాయంత్రం 4:05 ని.. ఫుల్ సాంగ్ విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా ఆ పాటను ప్రత్యేకంగా వీక్షించడం జరిగింది. మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సెట్స్ చూసేందుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ తన అన్నయ్యను కలుసుకొని కొంత సేపు మాట్లాడుకున్నారు. అంతేకాకుండా బాస్ పార్టీ పాటను కూడా ఆయన వీక్షించడం జరిగింది అని దర్శకుడు బాబి సోషల్ మీడియాలో తెలియజేశారు. తనకు ఎంతో ఇష్టమైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఉండడం చాలా ఆనందంగా ఉందని అని అన్నాడు.

ఇది ఒక మర్చిపోలేని అనుభూతి అని కళ్యాణ్ గారు బాస్ పార్టీ సాంగ్ చూడడమే కాకుండా ఎంతగానో ఇష్టపడ్డారు అని బాబీ అన్నారు. అలాగే ఆయన ఎల్లప్పుడూ చాలా పాజిటివ్ గా ఆలోచిస్తారు అని ఎంత కాలమైనా పవర్ స్టార్ అలానే ఉన్నారు అని కూడా బాబీ వివరణ ఇచ్చారు. గతంలో బాబి పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ తో పాటు ప్రత్యేకంగా ఆ సెట్స్ కు హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్ అలాగే నిర్మాత ఏఎం రత్నం కూడా వచ్చారు. ఇక వీరికి సంబంధించిన ఫోటోలను కూడా దర్శకుడు బాబి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇక వాల్తేరు వీరయ్య సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శృతిహాసన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా రవితేజ ఒక ప్రత్యేకమైన పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు.


Click it and Unblock the Notifications











