Bheemla Nayak Title Song: ఊహించిన దానికి మించి.. పూనకాలు తెప్పించిన ‘భీమ్లా నాయక్’

దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతూ తన హవాను చూపిస్తూ దూసుకెళ్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. పేరుకు మెగాస్టార్ చిరంజీవి సోదరుడే అయినా.. మొదటి చిత్రంలోనే మార్షల్ ఆర్ట్స్‌తో మెప్పించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కెరీర్ ఆరంభంలోనే పలు హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ ఇమేజ్‌ను అందుకున్నాడు. అదే సమయంలో ఫ్యాన్ బేస్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ స్టార్ హీరో వరుస సినిమాలతో సత్తా చాటుతున్నాడు.

రీఎంట్రీలో ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే 'వకీల్ సాబ్' అనే చిత్రంతో గ్రాండ్ ఎంట్రీని అందుకున్న ఆయన.. అది పట్టాలపై ఉన్న సమయంలోనే ఎన్నో ప్రాజెక్టులను ఫైనల్ చేసుకున్నాడు. అందులో మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియం'కు రీమేక్‌గా 'భీమ్లా నాయక్' అనే సినిమాను చేస్తున్నాడు. టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి ఇందులో కీలక పాత్రను చేస్తున్నాడు. విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన సాగర్ కే చంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే కానుకను అందించింది చిత్ర యూనిట్.

Pawan Kalyans Bheemla Nayak Title Song Released

ఈరోజు (సెప్టెంబర్ 2) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినం. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని 'భీమ్లా నాయక్' యూనిట్ టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ కంపోజ్ చేసిన ఈ పాట ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉంది. ఈ సాంగ్‌ను రామజోగయ్య శాస్త్రి రచించగా.. శ్రీకృష్ణ పృథ్వీ చంద్ర, రామ్ మిరియాలతో కలిసి థమన్ స్వయంగా ఆలపించాడు. ఆరంభంలో భీమ్లా నాయక్ చరిత్రను చెబుతూ దర్శనం మొగలయ్య బుర్రకథలా చెప్పాడు. ఇక, ఈ పాటలో లిరిక్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయనే చెప్పాలి. అలాగే, కంపోజీషన్, పాడిన విధానం కూడా చాలా కొత్తగా ఆకట్టుకునేలా ఉంది. మొత్తానికి ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేసింది 'భీమ్లా నాయక్' యూనిట్.

Pawan Kalyans Bheemla Nayak Title Song Released

మలయాళంలో 'అయ్యప్పనుమ్ కోషియం'.. ఇగో ఉన్న ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ డాన్ మధ్య జరిగే పోరుతో తెరకెక్కింది. ఇందులో బీజూ మీనన్ ఎస్సైగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ లోకల్ డాన్‌గా నటించారు. ఇప్పుడిదే కథను తెలుగు పరిస్థితులకు అనుకూలంగా మార్చి 'భీమ్లా నాయక్'గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కల్యాణ్.. లోకల్ డాన్ రోల్‌లో దగ్గుబాటి రానా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. ఇక, దీన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'భీమ్లా నాయక్' మూవీని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు పర్యవేక్షణ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం ఇస్తున్నాడు. నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక, కొద్ది రోజుల క్రితం ఈ మూవీ నుంచి విడుదలైన గ్లిమ్స్ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. అదే సమయంలో మూవీపై అంచనాలు కూడా పెరిగిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X