‘సీత’లో పాయల్ రాజ్ పుత్ స్పెషల్ సాంగ్.. సూపర్ మాస్
RX 100 చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ త్వరలో తేజ దర్శకత్వంలో రూపొందుతున్న 'సీత' మూవీలో స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను అలరించబోతోంది. 'బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి' అంటూ సాగే ఈ సాంగ్ లిరికల్ వీడియోను ప్రమోషన్లో భాగంగా బుధవారం విడుదల చేశారు.
తేజ దర్శకత్వంలో వచ్చే సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ సినిమాకు హైలెట్ అయ్యేలా ఉంటాయి. 'సీత' మూవీలో కూడా ఈ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారు. అనూప్ రూబెన్స్ అందించిన ట్యూన్స్‌కు అనుగుణంగా పాయల్ సెక్సీ డాన్స్ ప్రదర్శన ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించడం ఖాయం అనేలా ఉంది.
బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి... రాజ్‌దూత్ మీదొచ్చే రాంరెడ్డి.. యమహా యేసుకొచ్చే యాదిరెడ్డి.. బజాజ్ మీదొచ్చే బాలిరెడ్డి.. స్టాండైన వెయ్యరు, వచ్చాక ఆగరు.. ఎట్టా సచ్చేదిరో పెద్ది రెడ్డి అంటూ సురేంద్ర కృష్ణ అందించిన లిరిక్స్, అందుకు తగిన విధంగా అనూప్ మాస్ బీట్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా 'సీత' చిత్రం తెరకెక్కుతోంది. కథ సాగే క్రమంలో వచ్చే ఓ సిచ్యువేషన్లో 'బుల్ రెడ్డి... అనే పాట వస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో సోనూ సూద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











